Advertisementt

రానా సినిమాకి హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌!

Mon 09th Mar 2020 07:13 PM
rana daggubati,hollywood,bollywood,virataparvam,latest,update  రానా సినిమాకి హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌!
Hollywood And Bollywood Technicians Working For Rana Virataparvam రానా సినిమాకి హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌!
Advertisement
Ads by CJ

రానా ‘విరాట‌ప‌ర్వం’కు ప‌నిచేస్తున్న హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విరాట‌ప‌ర్వం’. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. చివ‌రి షెడ్యూల్ మాత్ర‌మే మిగిలుంది. త్వ‌ర‌లోనే ఆ షెడ్యూల్‌ను మొద‌లుపెట్ట‌నున్నారు.

ఈ చిత్రానికి కొంత‌మంది హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టులు ప‌నిచేస్తుండ‌టం విశేషం. ఈ సినిమాలోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల్లో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఒక‌టి. బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘ఉరీ: ద స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌’కు ప‌నిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.

యాక్ష‌న్‌ స‌హా అన్ని ర‌కాల స‌న్నివేశాల‌కు రానా, ఇత‌ర తారాగ‌ణం పూర్తిస్థాయిలో శ్ర‌మిస్తుండ‌గా, ఉన్న‌త‌స్థాయి నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో నిర్మాత‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘నీదీ నాదీ ఒకే క‌థ’ ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్‌-లోపెజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ఈ వేస‌విలో ‘విరాట‌ప‌ర్వం’ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

Hollywood And Bollywood Technicians Working For Rana Virataparvam:

Rana Virataparvam Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ