‘ఆహా’కు అపూర్వ ఆదరణ.. భారీగా రిజిస్ట్రేషన్స్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రారంభమైన పక్కా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘ఆహా’. 100% తెలుగు వెబ్ సిరీస్, సినిమాల స్ట్రీమింగ్ యాప్. ఫిబ్రవరి 8న ప్రముఖులు సమక్షంలో ఈ యాప్ ప్రివ్యూ జరిగిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఎగ్జయిటింగ్ కంటెంట్‌ను అందించే దృక్పథంతో ప్రారంభమైన ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌పామ్‌కు తెలుగు ప్రేక్షకుల నుండి అపూర్వమైన ఆదరణ దొరుకుతుంది. ప్రాంతీయ భాషలో ప్రారంభమైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఆహాకు మంచి ఆదరణ దక్కుతుంది. ప్రారంభమైన రెండు వారాల్లోనే ఐదు లక్షల రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకుని మిలియన్ దిశగా కదులుతుంది. ఇప్పటికే ఆహా యాప్ 671000 రిజస్ట్రేషన్ మార్క్‌ను రీచ్ అయ్యింది.
36 నిమిషాలు స్ట్రీమింగ్ సగటుతో 2 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఇప్పటి వరకు 24,313,661 నిమిషాలను వీక్షించారు. మస్తీస్, కొత్త పోరడు, షిట్ హెపెన్స్, గీతా సుబ్రమణ్యం వంటి వెబ్ సిరీస్‌లతో పాటు అర్జున్ సురవరం, ఖైదీ, ప్రెజర్ కుక్కర్ వంటి గ్రేట్ కంటెంట్‌తో ఆహా తెలుగు ప్రేక్షకుల ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌గా మారింది. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆహా యాప్‌ను మార్చి 25న భారీ లెవల్లో లాంఛ్ చేస్తున్నారు. ఈ వేడుకలో ఇండస్ట్రీ ప్రముఖులు, సెలబ్రీటీలు పాల్గొంటున్నారు.