టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ కి సినిమాల్లో భారీ క్రేజ్ ఉంది. పవన్, మహేష్, ప్రభాస్ అంటూ మొదలెడితే.. మొదటగా మహేష్ పేరే చెబుతారు. అయితే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనలేం కానీ.. మహేష్ బాబుకి మాత్రం అందగాడు, క్రేజ్ ఉంది ఇలా సినిమాల విషయంలో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరో మహేష్. ఇక సినిమాల్లోనే కాదు.. పలు బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ స్టార్ హీరోలెవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఒకటా రెండా ఏకంగా 22 ఎండోర్స్‌మెంట్స్ మహేష్ చేతిలో ఉన్నాయి అంటే మహేష్ యాడ్స్ పరంగా ఏ హీరో తన దరిదాపుల్లోకి రానిచ్చేలా లేడు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లు మహేష్ కన్నా ఎంతో వెనకబడి ఉన్నారు. ఏ యాడ్ లో చూసినా మహేషే. ఏ కంపెనీ చూసినా మహేష్ వెనకాలే పడుతుంది.
చెప్పులు, నగలు, బట్టలు, బస్సులు, రియలెస్టేట్ అబ్బో ఒకటేమిటి.. మహేష్ 24 గంటలు పనిచెయ్యాలే కానీ.. చేతినిండా పనే. మహేష్ సినిమాలతో ఎంత సంపాదిస్తున్నాడో దానికి డబుల్ యాడ్స్ రూపంలో అందుకుంటున్నాడు. తాజాగా మహేష్ కి మరో బడా కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. కార్ దేఖో కి సంబందించిన యాడ్ త్వరలోనే రెడీ కాబోతుంది. ఈ యాడ్ చిత్రీకరణ కూడా మహేష్ త్వరలోనే మొదలెట్టనున్నాడు. అలాగే మహేష్ ఇప్పటికే బిజినెస్ లను కూడా ఎడాపెడా మొదలెట్టేసాడు. సినిమా థియేటర్స్ రంగంతో పాటుగా క్లోతింగ్ బిజినెస్ చేస్తున్న మహేష్ త్వరలోనే పెర్ఫ్యూమ్ బిజినెస్ లోకి దిగబోతున్నాడనే టాక్ మొదలయ్యింది. మహేష్ పేరుతోనే ఓ సిగ్నేచర్ పర్ఫ్యూమ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు. మరి ఈ రేంజ్ వ్యాపారాలు, యాడ్స్ మహేష్ కి ఉన్నట్టుగా మరే ఇతర హీరోలకు లేవంటే నమ్మాలి. మహేష్ ఎన్ని చేసినా ఇంకా బోలెడన్ని కంపెనీలు మహేష్ చుట్టూనే తిరుగుతున్నాయంటేనే మహేష్ కి ఎంత క్రేజో అర్ధమవుతుంది.