మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తునాడు. సుకుమార్ నుండి వచ్చే ఏ సినిమాకైనా జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆ ఆసక్తి ఈ ఉప్పెన చిత్రం పట్ల కూడా ఉంది.
అయితే అంతకంటే ఎక్కువ ఆకర్షిస్తున్న అంశం ఉప్పెనలో మరోటి ఉంది. నిన్న ఈ సినిమా నుండి ధక్ ధక్ ధక్ అనే పాట వీడియో ప్రోమోని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాట జనాల్ని బాగా ఆకట్టుకోవడానికి ముఖ్య కారణం హీరోయిన్ క్రితి శెట్టి. ధక్ ధక్ ధక్ అన్నప్పుడల్లా ఆమే చూపించిన హావాభావాలు, నవ్విన నవ్వులు బాగా ఆకర్షించాయి. ఆమె నవ్వినప్పుడల్లా ప్రతీ ఒక్కరి గుండె ధక్ ధక్ ధక్ మని నిజంగానే కొట్టుకుంటుంది.. అంతలా మెస్మరైజ్ చేసింది క్రితి..
సినిమా పేరు ఉప్పెన అని పెట్టడమేమో గానీ ఆమె నవ్వులోనే ఒక ఉప్పెన ఉందని, అందులో పడి ఎవ్వరైనా కొట్టుకు పోవాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. నీ కన్ను నీలి సముద్రం పాటతో అటెన్షన్ ని క్రియేట్ చేసిన ఉప్పెన ధక్ ధక్ ధక్ పాటతో మళ్ళీ చూపుతిప్పుకోనీకుండా చేసింది.