Advertisementt

ఆ కన్ఫ్యూజన్ జనాల్లోనే కాదు మహేష్ కి కూడా ఉందట..

Wed 11th Mar 2020 08:51 PM
mahesh babu,parashuram,vamshi paidipally  ఆ కన్ఫ్యూజన్ జనాల్లోనే కాదు మహేష్ కి కూడా ఉందట..
confusion between Mahesh and Parasuram ఆ కన్ఫ్యూజన్ జనాల్లోనే కాదు మహేష్ కి కూడా ఉందట..
Advertisement
Ads by CJ

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తానని ప్రకటించాడు. వంశీ మహేష్ కోసం కథ కూడా సిద్ధం చేశాడు. కానీ సడెన్ గా మహేష్, వంశీల కాంబోలో సినిమా క్యాన్సిల్ అయిందని వార్త వచ్చింది. ఈ విషయమై ఎవరూ స్పందించకపోయినప్పటికీ మహేష్ బాబు మరో డైరెక్టర్ తో సినిమా చేసే విషయంలో సంప్రదింపులు జరుపుతున్నాడని తెలియడంతో వంశీతో సినిమా ఉండదని కన్ఫర్మ్ అయ్యారు.

మహేష్ సంప్రదింపులు జరిపిన డైరెక్టర్ ఎవరో కాదు. గీత గోవిందం సినిమాతో దర్శకుడిగా తన గీత మార్చుకున్న పరశురామ్ కావడం విశేషం. వంశీతో సినిమా క్యాన్సిల్ అవగానే పరశురామ్ తో సినిమా ఉంటుందని, దానికి సంబంధించిన కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. అయితే రియాలిటీకి వచ్చేసరికి వీరిద్దరి మధ్య సినిమాకి సంబంధించిన డిస్కషన్ నిజమే అయినప్పటికీ ఇంకా కన్ఫర్మ్ కాలేదని తెలుస్తుంది.

జనాల్లో ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన మహేష్ బాబు సినిమా వార్త పరశురామ్ ని కూడా కన్ఫ్యూజన్ లో పడేసిందట. పరశురామ్ మాత్రమే కాదు మహేష్ కూడా సినిమా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడట. మరి ఈ కన్ఫ్యూజన్ కి తెరపడి ఎప్పుడు తేటతెల్లం చేస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

confusion between Mahesh and Parasuram:

fans are in confusion about Maheshs next project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ