Advertisementt

అమిత్ షా ఆవిష్కరించిన పురాణపండ ‘నన్నేలు నా స్వామి’

Thu 12th Mar 2020 12:58 PM
amit shah,puranapanda srinivas,kishan reddy,union home minister of india,sai korrapati,nannelu naa swamy book  అమిత్ షా ఆవిష్కరించిన పురాణపండ ‘నన్నేలు నా స్వామి’
Amit Shah Unveils Puranapanda Srinivas’s ‘Nannelu Naa Swamy’ Book అమిత్ షా ఆవిష్కరించిన పురాణపండ ‘నన్నేలు నా స్వామి’
Advertisement
Ads by CJ

పురాణపండ ‘నన్నేలు నా స్వామి’ మహాగ్రంధాన్ని ఆవిష్కరించిన అమిత్ షా 

ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారిక మాసపత్రిక ‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ మరొక సారి పవిత్ర సంచలనానికి తెర లేపారు. సాక్షాత్తూ ఈ దేశ హోమ్ శాఖామంత్రి అమిత్ షా చే బుధవారం ఉదయం ఒక అద్భుతమైన, అనిర్వచనీయ ఒక అఖండ మహా గ్రంధాన్ని ఆవిష్కరింప చేసి ప్రశంసలు పొందారు. ప్రముఖ చలన చిత్రనిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం సంస్థ అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క శక్తి క్షేత్రంగా మలచి, ఒక భౌతికాతీతమైన అపురూప ఆంజనేయ స్వామి మహా మంత్ర వాగ్మయంతో, వ్యాఖ్యానాలతో రచించి, సంకలనం చేసి ‘నన్నేలు నాస్వామి’ పేరుతో దేశంలోనే మొదటి అఖండ గ్రంధంగా సంచలనం సృష్టించారు 

న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో బుధవారం ‘నన్నేలు నాస్వామి’ మహా గ్రంధాన్ని ఆవిష్కరించిన అమిత్ షా మాట్లాడుతూ.. నాకు తెలుగు రాకపోయినా ఈ మహా గ్రంధాన్ని పూర్తిగా పేజీలు తిప్పి చూస్తుంటే ఏదో శక్తి ఆవహిస్తున్నట్లుందని, హనుమద్భక్తులకు ఆత్మశక్తినిచ్ఛే ఈ మహా విజయాల సాధనా గ్రంధాన్ని ఆంజనేయ స్వామి కటాక్షం వల్లనే పురాణపండ శ్రీనివాస్ ఇంతటి తేజస్సుతో అందించగలిగారని అభినందించారు. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి పర్యవేక్షణలో తొలిప్రతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డికి అందజేశారు.

ఈ గ్రంథ రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ నిర్మాణాత్మక సామర్ధ్యం, అసాధారణ ప్రతిభ, అద్భుత రచనాశైలి, విరామమెరుగక చేసే కృషి, నిస్వార్ధ సేవ తనను ఎంతో  ఆకట్టుకోవడంతో, తాను ఆంజనేయస్వామిపై ఒక మహాగ్రంధాన్ని అందించమని శ్రీనివాస్‌ని కోరడంతో ఈ అద్భుతాన్ని శ్రీనివాస్ ఎంతో పరిశ్రమించి అందించారని, అమిత్ షా వంటి మహా శిఖరం ఈ గ్రంధాన్నిఆవిష్కరించడం తనను అనుభూతికి లోను చేసిందని, ఈ కార్యంలో సహకరించిన కిషన్ రెడ్డికి, పురాణపండ శ్రీనివాస్‌కి సాయి కొర్రపాటి వినయ పూర్వకంగా కృతజ్ఞతలుచెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్, మరొక కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తెలుగు రాష్ట్రాలతోనే కాకుండా దేశ దేశాలలో గత దశాబ్దకాలంగా పురాణపండ శ్రీనివాస్ గ్రంధాలకు వున్న ఫాలోయింగ్ వేరే చెప్పక్కర్లేదు. అందమైన శైలితో పాటు, అద్భుతమైన వక్తగా విశేషఖ్యాతి పొందిన పురాణపండ శ్రీనివాస్ మహోన్నత ఆధ్యాత్మిక గ్రంధాల తేజస్సు వెనుక రేయింబవళ్ల నిర్విరామ కృషి, నిస్వార్ధ సేవ, రాజీపడని మనస్తత్వంతో పాటు తిరుమల శ్రీనివాసుని కటాక్షమేనని సన్నిహితులు చెబుతుంటారు.

Amit Shah Unveils Puranapanda Srinivas’s ‘Nannelu Naa Swamy’ Book:

Nannelu Naa Swamy penned by Puranapanda Srinivas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ