ప్రస్తుతం కరోన వైరస్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. దీని కారణంగా సెన్సెక్స్, షేర్ మార్కెట్ బాగా దెబ్బతిని పోయి అనేక రకాలుగా నష్టాల్లో కురుకుపోతుంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలు, థియేటర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లు అన్నీ ఈ నెల 31 వరకు మూసివేయాలని గట్టిగా నిర్ణయించింది. పరీక్షలు యధాతధంగా జరపాలని కూడా అసెంబ్లీలో తీర్మానించారు.
ఇప్పటికే పక్క రాష్ట్రం అయిన బెంగుళూరులో ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడి ప్రభుత్వం షాపింగ్ కాంప్లెక్స్ లు థియేటర్స్ క్లోజ్ చేయడం జరిగింది. కరోన వైరస్ ని మనదాక రానీయకుండా ముందుగా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది తెలంగాణ ప్రభుత్వం.తెలంగాణ సీఎం కె. చంద్రశేఖ ర్రావు నేడు అసెంబ్లీ కమిటీ హాలులో కరోనా వైరస్ పై తీసుకోవలసిన నివారణ చర్యలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్, సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హై అలెర్ట్,
ఈ నెలాఖరు వరకు విద్యాసంస్థలు, థియేటర్లు, షాపింగ్ మాల్స్ మూసివేత తదితర ప్రభుత్వ ముందస్తు చర్యలు. పదవ తరగతి పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు.