Advertisementt

కరోనా ఎఫెక్ట్: ఆడియన్స్ లేని అవార్డ్ ఫంక్షన్స్

Sun 15th Mar 2020 02:08 PM
zee cinema awards,audience,celebrities,rakul preet singh,tapsee,ranveer singh  కరోనా ఎఫెక్ట్: ఆడియన్స్ లేని అవార్డ్ ఫంక్షన్స్
No Audience at bollywood Zee Cinema Awards కరోనా ఎఫెక్ట్: ఆడియన్స్ లేని అవార్డ్ ఫంక్షన్స్
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో ఏ రేంజ్ లో అవార్డ్స్ ఫంక్షన్స్ జరుగుతాయో.. ఎప్పటికప్పుడు స్టార్ ప్లస్, జీ టివి లలో చూస్తూనే ఉంటాం. బాలీవుడ్‌లో అవార్డ్స్ ఫంక్షన్స్ కి ఏ ఇండస్ట్రీ ఫంక్షన్ సాటి రాదు. ఆ రేంజ్ లో అక్కడ అవార్డు ఫంక్షన్స్ జరుగుతాయి. స్టార్ హీరోలే హోస్ట్ లుగా మారి అందరిని కడుపుబ్బా నవ్విస్తారు. దానికి లక్షల్లో ప్రేక్షకులు హాజరవుతారు. స్టార్ హీరోల హోస్టింగ్ తో స్టార్స్ స్టేజ్ మీద డాన్స్ లతో హోరెత్తించే.. ఈ ఫంక్షన్స్ కి స్టార్ హీరోయిన్స్, హీరోస్ అంతా స్పెషల్ గా డిజైన్ చేసిన హాట్ డ్రెస్సులతో అదరగొట్టేస్తారు. తాజాగా కరోనా వైరస్ భయంతో చాలా భాషల్లో ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్స్ ని క్యాన్సిల్ చేస్తుంటే.. బాలీవుడ్ లో మాత్రం ఓ అవార్డు వేడుక అదిరిపోయేలా జరిగింది.

శుక్రవారం రాత్రి ముంబైలో జీ సినిమా అవార్డ్స్ వేడుక అదిరింది. కాకపోతే ప్రేక్షకులే లేరు. ప్రేక్షకులు లేకుండానే బాలీవుడ్ తారాగణం మొత్తం ఓ చోట చేరి.. ఈ అవార్డ్స్ వేడుకని సక్సెస్ చేసారు. అందమైన డ్రెస్సుల్తో..ఆదరగట్టే అందంతో.. మత్తెక్కించే లుక్స్ తో అందాలు ఆరబోస్తూ హీరోయిన్స్ చేసిన సందడి ప్రేక్షకులు కరోనా భయంతో మిస్ అయ్యారనే చెప్పాలి. రణ్వీర్ సింగ్, తాప్సి, రకుల్ ఇలా అంతా అందంగా తయారై జీ సినిమా మహోత్సవాన్ని పరిపూర్ణం చేసారు. పాపం ఆ సందడి చూడడానికి ప్రేక్షకులు లేరని బాధపడక్కర్లేదు ఎందుకంటే జీ లో త్వరలోనే ఈ అవార్డ్స్ వేడుకని గ్రాండ్ గా ప్రసారం చేస్తుంది. దాన్ని చూసి తనివితీరా ఆనందించవచ్చు.

No Audience at bollywood Zee Cinema Awards :

Only Celebrities attends for Zee Cinema Awards 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ