Advertisementt

ఉగాదికి చిరు-పవన్-ప్రభాస్ వచ్చేస్తున్నారు!

Sun 15th Mar 2020 05:18 PM
chiranjeevi,pawan kalyan,prabhas,ugadi,treat  ఉగాదికి చిరు-పవన్-ప్రభాస్ వచ్చేస్తున్నారు!
News About Chiru-Pawan-Prabhas ఉగాదికి చిరు-పవన్-ప్రభాస్ వచ్చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

ఉగాది.. అనేది తెలుగువారు జరుపుకునే పండుగల్లో ముఖ్యమైనది అనే విషయం తెలిసిందే. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలుకానుంది కావున ఇది తెలుగువారి మొదటి పండుగ అని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించడానికి తెలుగు ప్రజలు ఎంతో ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే ఈ సారి టాలీవుడ్‌లోనే ఉగాది వేడుక గ్రాండ్‌గా జరగనుంది. అదెలాగా..? కొంపదీసి స్టార్స్ అంతా ఏమైనా చేయబోతున్నారా..? అనే ఆలోచన వస్తోందేమో.. అదేంకాదండోయ్.. అంతకుమించే ఉంది. ఆ పండగేంటే ఈ కథనంలో తెలుసుకుందాం.

టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ముగ్గురూ బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే ఉగాది రోజున వీరి సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్.. వేచి చూసే అభిమానులకు తియ్యటి శుభవార్త ఆయా చిత్రాల డైరెక్టర్స్ చెప్పబోతున్నారట. అదెలాగంటే.. మెగాస్టార్ చిరు-కొరటాల కలిసి సినిమా నుంచి ఉగాదికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట. పవన్ విషయానికొస్తే ‘వకీల్‌ సాబ్‌’కు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ కమ్ టైటిల్, సాంగ్‌ వదిలిన చిత్ర బృందం టీజర్ రిలీజ్ చేయనుందట.

ప్రభాస్ విషయానికొస్తే.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సగంకుపైగా షూటింగ్ పూర్తయ్యింది. ఇంతవరకూ సినిమా టైటిల్ చెప్పుకోలేదు. దీంతో ఉగాది రోజున టైటిల్ రివీల్ చేస్తారని టాక్ నడుస్తోంది. అంటే అటు మెగా బ్రదర్స్ ఇటు యంగ్ రెబల్ స్టార్ ఈ ఉగాదికి కలిసి వచ్చేస్తున్నారట. సో.. ఇటు మెగాభిమానులకు, అటు రెబల్ ఫ్యాన్స్‌కు ఉగాది ట్రీట్ అదిరిపోనుందన్న మాట. ఒకేసారి ఇలా ముగ్గురు హీరోలు వచ్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక డబుల్ డోస్ పండుగేనన్న మాట. మరి చిరు-పవన్-ప్రభాస్‌ ముగ్గురూ ఒకే రోజున రావడం సాధ్యమవుతుందో అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాలి.

News About Chiru-Pawan-Prabhas:

Chiru, Pawan and Prabhas Treat on Ugadi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ