Advertisementt

బాబుగారింట్లో బుట్ట భోజనం.. ఇంట్రస్టింగ్‌గా ఉంది

Mon 16th Mar 2020 04:44 PM
nagababu,arrange,program,ugadi,zee telugu,etv  బాబుగారింట్లో బుట్ట భోజనం.. ఇంట్రస్టింగ్‌గా ఉంది
Ugadi Special: ETV Vs Zee Telugu బాబుగారింట్లో బుట్ట భోజనం.. ఇంట్రస్టింగ్‌గా ఉంది
Advertisement
Ads by CJ

ఈటీవీ జబర్దస్త్.. పండగ స్పెషల్ ప్రోగ్రాంతో ఇతర ఛానల్స్ కి నిద్ర లేకుండా చేస్తుంది. జబర్దస్త్ తో టీఆర్పీ రేటింగ్ లో ఏ ఛానల్ కి అందనంత ఎత్తులో ఉన్న ఈటివి ని పడగొట్టెయ్యడానికి ప్రతి ఛానల్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ని రెడీ చేస్తూ నే ఉన్నాయి. కానీ ఈటివి ఛాయలకు కూడా అవి రాలేకపోయాయి. ఇక పండగ స్పెషల్ ప్రోగ్రామ్స్ లోను ఈటివి ముందుంటుంది. తాజాగా ఉగాది పండగ స్పెషల్ ప్రోగ్రాం పండగ సర్ పండగ అంతే అంటూ రోజా, శేఖర్ మాస్టర్ జెడ్జెస్ గా సుధీర్, శ్రీముఖి యాంకర్స్ గా కమెడియన్స్, సింగర్స్, డాన్స్ మాస్టర్స్ చేసే సందడితో స్పెషల్ ప్రోగ్రాంని ఓ రేంజ్ లో చేసింది. ఇప్పటికే ఆ ప్రోమో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది.

అయితే ఈటివి మల్లెమాల మీద కసితో నాగబాబు జీ ఛానల్ కి వెళ్లి అదిరింది అంటూ కామెడీ ప్రోగ్రాం చేసి కామెడీ అయ్యాడు. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఆ కసితోనే నాగబాబు ఉగాదికి జీ ఛానల్ లో స్పెషల్ ప్రోగ్రాం చూపించాడు. నాగబాబు జేడ్జ్ గా అనసూయ స్పెషల్ డాన్స్ తో, జానీ మాస్టర్ అదిరిపోయే స్టెప్స్ తో బాబుగారింట్లో బుట్ట భోజనం అంటూ చేసిన ఉగాది స్పెషల్ ప్రోగ్రాం ప్రోమో చూస్తుంటే ఈసారి ఈటీవీకి తడిచిపోవడం ఖాయంగా కనబడుతుంది. ప్రదీప్ యాంకర్ గా యాంకర్ రవి, నిహారిక కొణిదెల, అనసూయ అదిరిపోయే డాన్స్, కమెడియన్స్ అల్లరి.. అబ్బో ఒకటేమిటి.. మన తెలుగు సంవత్సరాది ఉగాది... కొత్త బట్టలు, పిండి వంటలు, షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు మీ ముందుకు వస్తుంది... బాబు గారింట్లో బుట్ట భోజనం అంటూ వాయించేయడమే కాదు.. నిశ్శబ్దం అనుష్క ఈ ప్రోగ్రాం కి స్పెషల్ గెస్ట్ అండి.

మరి ఎప్పుడూ స్పెషల్ ప్రోగ్రామ్స్ తో రొటీన్ గా మారిన ఈ టివి పండగ సర్.. పండగ అంతే అనే ప్రోగ్రాం ముందు ఈ జీ ఛానల్ ఉగాది స్పెషల్ బాబుగారింట్లో బుట్ట భోజనం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక ఆ ప్రోమో చివర్లో నాగబాబు డైనింగ్ టేబుల్ వద్ద అందరూ కలిసి భోజనం చేసే సీన్ మరింత ఆసక్తిగా కనబడుతుంది. 

Ugadi Special: ETV Vs Zee Telugu:

Nagababu Arranged Special Program for Ugadi in Zee

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ