Advertisementt

పాలిటిక్స్, ఫేమ్, తొక్కా తోలు ఏమీ ఉండదు!

Tue 17th Mar 2020 07:05 PM
natural star,actor nani,corona virus,kovid-19,tollywood,politics  పాలిటిక్స్, ఫేమ్, తొక్కా తోలు ఏమీ ఉండదు!
Natural star Nani on Corona Virus పాలిటిక్స్, ఫేమ్, తొక్కా తోలు ఏమీ ఉండదు!
Advertisement
Ads by CJ

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్పందించి తమ వంతుగా జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు. అయితే.. తాజాగా నేచురల్ స్టార్ నాని మాత్రం వెరైటీగా స్పందించాడు.

తొక్క తోలూ ఏమీ ఉండదు..

అందరూ చెప్పినట్లుగా నేనూ చెబితే అందులో కొత్తదనం ఏముంటుంది..? అని నేచురల్ స్టార్ భావించాడేమో.. నా రూటే సపరేటు అని తనదైన స్టైల్‌లో ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్  చేశాడు. ‘పాలిటిక్స్, కులం, మతం, పవర్, డబ్బు, ఫేమ్, తొక్క తోలు ఏమీ ఉండదు.. చివరకి మనిషికి మనిషే. మనమంతా ఒక పెద్ద కుటుంబం. ఒకరిపై ఒకరు జాగ్రత్త తీసుకోవడం ఎంతో అవసరం. బాధ్యతగా ఉండండి.. భద్రంగా ఉండండి’ అని నాని ట్వీట్ చేశాడు.

ఎంతైనా నేచురల్ స్టార్ కదా.. ఇలా వెరైటీగా స్పందించాడు. అయితే.. ఈ ట్వీట్‌కు అభిమానులు, నెటిజన్లు, సినీ ప్రియులు, ఫాలోవర్స్ పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అవును అన్నా మీరు చెబుతున్నది.. వైరస్‌కు చిన్నా పెద్దా.. డబ్బున్నోడు.. లేనోడు అనే తేడా ఏముంటుంది.. ఎవరికైనా సోకుతుంది.. ఎవర్నయినా తీసుకెళ్లిపోతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Natural star Nani on Corona Virus:

Natural star Nani on Corona Virus  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ