సోషల్ మీడియా ఎప్పుడైతే ప్రారంభమైందో.. నాటి నుంచి నేటి వరకూ దీన్ని మంచికి వాడటం కంటే చెడుకే ఎక్కువగా వాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు దీన్ని అభిమానులకు దగ్గరవ్వడం కోసం వాడుతుంటే.. కొందరు నెటిజన్లు మాత్రం అదే మీడియాతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఫొటోలు మార్ఫింగ్ చేసి హల్ చల్ చేసినట్లు.. పోలీసు కేసులు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే చాలా సార్లు మనం వార్తల్లో చూసే ఉంటాం. తాజాగా.. ఇలాంటి ఘటనే హాట్ హీరోయిన్, బొద్దుగుమ్మ నమితకు కూడా ఎదురైంది. ఇంతకీ ఈ భామ విషయంలో ఏం జరిగింది..? ఎందుకుంత హడావుడి..? స్ట్రాంగ్ వార్నింగ్ వెనుక అసలు కథేంటి..? అనే విషయాలు తెలుసుకుందాం.
ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ యువకుడు.. నమితతో చాటింగ్ ప్రారంభించాడు. ఈ సందర్భంగా హాయ్ ఐటమ్ అంటూ మెసేజ్ చేశాడు. అంతేకాదు.. నమిత ఈ మాట ఆగ్రహంతో ఊగిపోయే సరికి.. మరింత రెచ్చిపోయి.. ‘నీ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. ఎక్కువ మాట్లాడితే నీ పోర్న్ వీడియోలు నా దగ్గరున్నాయ్.. అవి బయటపెడతా’ అంటూ తెగ హడావుడి చేశాడు. బెదిరింపులు ఎక్కువయ్యే సరికి ఇక చేసేదేమీ లేకపోవడంతో నమితలోని ఆగ్రహావేశాలు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయ్.
‘ఆడవారిని ఇష్టానుసారం మాట్లాడుతూ.. ఇష్టమైన పేర్లతో పిలువవచ్చని భావించేవాడికి తానెందుకు మర్యాద ఇవ్వాలి. అసలు అలాంటి మాటలు అంటుంటే నేనుందుకు భరించాలి. అసలు స్త్రీ అంటే ఏంటో తెలుసుకో.. పో.. నీ ఇష్టం వచ్చింది చేసుకోపో’ అంటూ నమిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా.. ఇలాంటి వేధింపులు నటీమణులకు కొత్తేమీ కాదు.. ఇలాంటి చిల్లర కుర్రాళ్ల వల్ల ఎంతో మంది బాధితులయ్యారు.. అయితే ఇలా చేయడం వల్ల ఒరిగేదేంటి..? చివరికి కటాకటాల్లోకి వెళ్లడమే తప్ప ఏమైనా ఉంటుందా..? ఎక్కడ ఏం మాట్లాడాలి..? ఎవరితో ఎలా ప్రవర్తించాలి..? మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఎలా వాడుకోవాలి..? అనే విషయం ఇలాంటి కుర్రాలకు తెలియాలి లేకుంటే జైలు శిక్ష తప్పదు మరి.