Advertisementt

నచ్చకపోతే కళ్ళు మూసుకోండి అంతే..: రష్మీ

Thu 19th Mar 2020 03:11 AM
rashmi gauatam,anchor rashmi,rashmi dance,hot dance  నచ్చకపోతే కళ్ళు మూసుకోండి అంతే..: రష్మీ
Anchor Rashmi Warns To Audience! నచ్చకపోతే కళ్ళు మూసుకోండి అంతే..: రష్మీ
Advertisement
Ads by CJ

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. అటు బుల్లితెర రారాణిగా ఓ వెలుగుతూ.. అప్పుడప్పుడూ వెండితెరపైనా అంద చందాలు హొయలొలికిస్తోంది. అయితే.. ఈ భామ వార్తల్లో నిలవని రోజే లేదు. సుడిగాలి సుధీర్, శేఖర్ మాస్టర్ ఇలా కనీసం రెండ్రోజులకోసారైనా ఈ భామ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎన్నిసార్లు సుధీర్ విషయంలో క్లారిటీ ఇచ్చినా.. వీళ్లు చేసే కొన్ని తింగరి డ్యాన్స్‌లు, తిక్క తిక్క డైలాగ్స్‌తో పదే పదే వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి వన్నీ చూసి భరించలేని కొందరు నెటిజన్లు రష్మీపై తీవ్రస్థాయిలో.. బూతులు తిడుతూ ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ విమర్శలపై రష్మి తిరిగి కౌంటిరిస్తూ పోస్ట్ సైతం చేసింది.

కనీసం కామన్‌సెన్స్ లేదా..?

మేం ఏం చేసినా అది డిమాండ్ అండ్ సప్లై. జబర్దస్త్ విషయంలో ఎందుకిలా రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నారు. అసలు ఈ షోను కరోనా అంత దారుణంగా ఎందుకు పోలుస్తున్నారు. ఒకవేళ మేం ఊపుకుంటూ చేసే డ్యాన్స్‌లు నచ్చకపోతే కళ్లు మూస్కోండి.. లేకుంటే ఛానెలే మార్చేసుకోండి. మిమ్మల్ని ఎవరొద్దంటున్నారు. అసలు మిమ్మల్ని ఎవరు బలవంతంగా కాళ్లు చేతులు కట్టేసి ఇదే చూడాలని కూర్చోబెట్టలేదు కదా. కనీసం కామన్‌సెన్స్ లేదా..?. పోనీ మీరు డబ్బులు పెట్టి సినిమాలు తీసేప్పుడు నాకు ‘సతీ సావిత్రి’ లాంటి క్యారెక్టర్ ఇవ్వండి చేస్తా..!. జనాలకు ఏది కావాలో అదే మేం ఇస్తున్నాం.. చేస్తున్నాం. ఒక్క షో అనేది హిట్ అవ్వడానికి కారణం ఆడియన్స్, వ్యూయర్ షిప్’ అనే విషయాలు తెలుసుకొండి అంటూ రష్మీ ఆగ్రహంతో ఊగిపోయింది. కాగా.. కొందరు పనిగట్టుకుని మరీ లైవ్ వచ్చినప్పుడు, వీడియోలకు.. సెలబ్రిటీల పోస్ట్‌లకు ఇష్టానుసారం వల్గర్‌గా మాట్లాడేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని రష్మీ ఎడాపెడా వాయించేసింది.

Anchor Rashmi Warns To Audience!:

Anchor Rashmi Warns To Audience!  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ