సుకుమార్ రంగస్థలం వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడట. రంగస్థలంలో రామ్ చరణ్ లాగా ఈ సినిమాలోనూ అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపిస్తాడట. ఇప్పటి వరకు తెర మీద మనం చూడని విధంగా అల్లు అర్జున్ ఈ సినిమాలో దర్శనక్మిస్తాడట.
అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. శేషాచలం అడవుల్లో శరవేగంగా తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ కరోనా వైరస్ కారణంగా కొన్ని రోజుల పాటు నిలిచిపోయింది. ఇప్పటికే ఆలస్యం అయిన ఈ సినిమా షూటింగ్ మరింతగా లేట్ అవుతుండడంతో సుకుమార్ ఈ ఖాళీ సమయాన్ని వృధా చేయకూడదని అనుకుంటున్నాడట. తనకి దొరికిన ఈ సమయాన్ని చాలా ప్రొడక్టివ్ గా వాడుకోవాలని చూస్తున్నాడట.
అందుకోసం కరోనా వైరస్ ప్రభావం గల రోజుల్లో తన సినిమాకి కావాల్సిన షూటింగ్ లొకేషన్స్ వెతికి పెట్టుకుంటున్నాడట. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడట. షూటింగ్ లేని సమయాన్ని ఇంత ప్రొడక్టీవ్ గా వాడుకుంటున్న సుకుమార్ ని అభినందించాల్సిందే..