టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ సినిమా తర్వాత నిఖిల్ గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 18 పేజెస్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. కుమారి 21 ఎఫ్ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే ఈ సినిమా లాంచన కార్యక్రమం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాలో హిరోయిన్ గురించి పెద్ద చర్చ జరుగుతుంది. నిఖిల్ సరసన ఏ హీరోయిన్ అయితే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారట. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న కృతి శెట్టిని 18 పేజీల్లో హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట.
ఉప్పెన సినిమ ఇంకా రిలీజ్ కాకుండానే రెండో అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. ఉప్పెన నుండి రిలీజైన పాటల్లో కృతి శెట్టి లుక్ కి చాలా మంది ఫిదా అయిపోయారు. ఆమె నవ్వుకి అప్పుడే ప్రేమలో పడిపోయారు. కేవలం హీరోయిన్ కోసమే సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నవాళ్ళు ఉన్నారు. ఆమెకి వచ్చిన ఈ క్రేజ్ చూసిన తర్వాతే 18 పేజీల్లో ఆమెకి అవకాశం వచ్చిందని తెలుస్తుంది.