Advertisementt

వాళ్లకు అక్కా చెల్లెల్లు, పిల్లలు ఉండరా..?: స్వీటీ

Mon 23rd Mar 2020 02:10 PM
sweety,anushka,angry,rumors,marriage  వాళ్లకు అక్కా చెల్లెల్లు, పిల్లలు ఉండరా..?: స్వీటీ
Sweety Anushka angry Over Rumors వాళ్లకు అక్కా చెల్లెల్లు, పిల్లలు ఉండరా..?: స్వీటీ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ హీరోయిన్ ఎవరంటే టక్కున గుర్తొచ్చేది స్వీటీ అనుష్కనే. ఈమె పెళ్లి గురించి ఇప్పటి వరకూ ఎన్నెన్ని వార్తలొచ్చాయో లెక్కలేదు. ఇదుగో పెళ్లి చేసుకోబోతోంది..? అదుగో పెళ్లి చేసుకోబోతోంది..? అంటూ ఎప్పుట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయ్. అంతేకాదు.. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్‌తో అనుష్క పెళ్లి అని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే పెళ్లి అని కూడా వార్తలు గుప్పుమన్నాయ్. ఆ తర్వాత అవన్నీ పుకార్లేనని ఇరువురూ కొట్టి పడేశారు. ఇటీవలే.. మరోసారి అనుష్క పెళ్లి పెళ్లి వార్తలు అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయ్. టీమిండియాకు చెందిన ఓ ప్రముఖ క్రీడాకారుడితో అనుష్క పెళ్లి అని కూడా వార్తలు వినిపించాయి. తాజాగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాశ్‌ను అనుష్క పెళ్లాడబోతుందని వార్తలు వినిపించాయి. 

ఈ బాంబు లాంటి వార్తలపై ఇంతవరకూ ఎక్కడా స్పందించని స్వీటీ.. తాజాగా ‘నిశ్శబద్దం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పింది. తనపై మొదట్నుంచి ఇలాంటి వార్తలు వస్తున్నాయని.. అసలు ఎందుకిలా అర్థం కావట్లేదని చెప్పుకొచ్చింది. సినిమా వాళ్లపై పుకార్లు రావడం సర్వసాధారణం అయితే.. తనపై మాత్రం మరీ ఎక్కువగా రాసేస్తున్నారని ఒకింత భావోద్వేగానికి లోనయ్యింది. అసలు ఏమీ లేకుండానే పుకార్లు పుట్టిస్తున్నారని.. మేం కూడా వాళ్లలాగే మనుషులం అనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు పలికింది. 

అంతటితో ఆగని యోగా బ్యూటీ.. తనపై తప్పుడు వార్తలు రాసేవాళ్లకీ అక్కా చెల్లెల్లు.. పిల్లలు ఉంటారు కదా..? అలా అనుకుని వాటి గురించి ఆలోచించడం మానేశానని చెప్పుకొచ్చింది. అయితే టీవీ చూడటం, న్యూస్‌ పేపర్‌ చదవడం తనకు అలవాటు లేదని.. ఎవరైనా ఫ్రెండ్స్ పంపిన మెసెజ్‌ల ద్వారా ఈ పుకార్ల గురించి తెలుసుకుంటానని అనుష్క చెప్పింది. మరి ఇంత జరిగిన తర్వాతైనా అనుష్కపై వార్తలు రాయడం మానేస్తారో లేకుంటే మరింత డోస్ పెంచి మరీ రాస్తారో వేచి చూడాలి. 

Sweety Anushka angry Over Rumors:

Sweety Anushka angry Over Rumors  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ