ప్రస్తుతం సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తున్న పాయల్ రాజపుత్ బాలయ్య - బోయపాటి సినిమాలో బాలయ్య సరసన నటించబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. వెంకటేష్‌తో వెంకిమామ, రవితేజతో డిస్కో రాజా చేసిన పాయల్ ఇక సీనియర్ హీరోలకే ఫిక్స్ అనుకున్నారు. అంతకుముందు బోల్డ్ పాత్రలతో హైలెట్ అయిన పాయల్ రాజపుత్ ప్రస్తుతం సీనియర్ హీరోలతోనే సర్దుకోవాలి.. లేదంటే పాయల్ రాజపుత్‌కి అవకాశాలు ఉండవనే అన్నారు. అందుకే బాలయ్య సినిమాలో పాయల్ అనగానే అందరిలో అనుమానం లేకుండా నిజమనే అనుకున్నారు. బాలకృష్ణ కోసం పాయల్ ని బోయపాటి సంప్రదిస్తున్నారనే న్యూస్ నడుస్తుంది.
కానీ తాజాగా పాయల్ రాజపుత్, బాలయ్య సినిమాలో తాను నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది. బాలకృష్ణ సర్ సినిమాలో నేను హీరోయిన్‌గా చేస్తున్నా అని వస్తున్న వార్తల్లో నిజం లేదని... నేను ఇంతవరకు కొత్త సినిమా కోసం సంతకం చెయ్యలేదని చెబుతుంది. ప్రస్తుతం తాను నటించిన 5ws చిత్రం తప్ప మరేది లేదని.. ప్రస్తుతం ఆ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది అని చెప్పింది. అయితే బాలయ్య సినిమాలో చెయ్యడం లేదని ఖండించాల్సిన అవసరం ఏముంది.. పాయల్ పేరు బాలయ్యకి తగిలిస్తే ఆమె క్రేజ్ ఏమైనా తగ్గుతుందా అని నందమూరి ఫ్యాన్స్ పాయల్‌పై ఫైర్ అవుతున్నారు.