Advertisementt

చరణ్ సినిమానే విశ్వక్ కాపీకొడుతున్నాడా..?

Mon 23rd Mar 2020 03:25 PM
vishwak sen,paagal,orange,ramcharan  చరణ్ సినిమానే విశ్వక్ కాపీకొడుతున్నాడా..?
Is Vishwak copying Charans movie చరణ్ సినిమానే విశ్వక్ కాపీకొడుతున్నాడా..?
Advertisement
Ads by CJ

ఫలక్ నుమా దాస్ సినిమాతో యూత్ లో క్రేజ్ ని పెంచుకున్న హీరో విశ్వక్ సేన్ హిట్ సినిమాతో ఓ మోస్తారు విజయం అందుకున్నాడు. హిట్ సినిమా ఇచ్చిన ఆనందంలో అతడు మరో సినిమాని స్టార్ట్ చేశాడు. పాగల్ అనే పేరుతో లాంచ్ అయిన ఈ సినిమాకి రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాకి సంబంధం ఉందని అంటున్నారు. మగధీర తర్వాత రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో హీరో వరుసగా ఒక్కొక్కరిని ప్రేమించుకుంటూ పోతాడు.

తన లైఫ్ లో ప్రతీ ఒక్క స్టేజ్ లో ఎవరితోనో ఒకరితో లవ్లో పడిపోతూ ఉంటాడు. అయితే అదే కాన్సెప్ట్ విశ్వక్ పాగల్ సినిమాలో కనిపించనుందట. పాగల్ సినిమాలోనూ హీరో విశ్వక్ వరుసగా ప్రేమించుకుంటూ పోతాడట. అయితే ఆరెంజ్ సినిమాలో స్పెషల్ గా కామెడీ అనేది ఉండదు. కథా పరంగా సినిమా వెళ్తూనే ఉంటుంది. కాకపోతే విశ్వక్ నటిస్తున్న పాగల్ సినిమాలో కామెడీ మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తుందట.

అయితే ఆరెంజ్ సినిమా చేసి రామ్ చరణ్ పెద్ద ఫ్లాపునే మూటగట్టుకున్నాడు. మరి దానికి సిమిలర్ కథతో వస్తున్న విశ్వక్ పాగల్ మూవీ ఏ విధంగా వర్కౌట్ అవుతుందనేది సందేహంగా ఉంది. అయితే ఆరెంజ్ సినిమా వచ్చినపుడు ఉన్న పరిస్థితులకి, ప్రస్తుత పరిస్థితులకి చాలా తేడా ఉండడంతో పాగల్ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

Is Vishwak copying Charans movie:

Vishwak Sen New movie paagal has similar concept with orange

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ