Advertisementt

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులకి సరైన టైమ్!

Wed 25th Mar 2020 05:10 PM
heroes,tollywood,new stories,corona virus,new directors,top directors  యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులకి సరైన టైమ్!
Corona Virus: Good Time to Young directors యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకులకి సరైన టైమ్!
Advertisement
Ads by CJ

కరోనా వైరస్‌తో ప్రజలు బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. ప్రజలే కాదు.. సెలబ్రిటీస్ కూడా ఈ కరోనా కాలాన్ని ఏ వర్కౌట్స్ తోనో, లేదంటే ఫ్యామిలీతోనో టైం స్పెండ్ చేస్తున్నారు. కొంతమంది హీరోలు పిల్లలతో ఆడుకుంటుంటే.. కొంతమంది అయితే సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై ప్రచారం చేస్తున్నారు. ఇక కొంతమంది హీరోలు మాత్రం ఈ సమయంలో తమకి కథలు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న దర్శకులకు కబురు పెడుతున్నారట. చాలామంది యంగ్ హీరోలు కొత్త ప్రాజెక్టుల షూటింగ్స్ తో చాలా కథలను హోల్డ్ లో పెట్టడం దర్శకులను హోల్డ్ లో పెట్టడం జరిగింది.

అయితే తాజాగా కరోనా తో ఇళ్లకే పరిమితమైన ఈ యంగ్ హీరోలు తమకి కథలు చెప్పడానికి రెడీ అయిన దర్శకులను ఒక్కొక్కరిగా ఇంటికి పిలిపించుకుని.. కూల్ మైండ్ తో కథలను వింటున్నారట. నచ్చితే స్క్రిప్ట్ సిద్ధం చెయ్యమని దర్శకులకు చెబుతున్నారట. ఇక కొంతమంది యంగ్ హీరోలైతే దర్శకులకు ఫోన్స్ చేసి మరీ తమకి ఎలాంటి కథలు కావాలో అలాంటి కథలను సిద్ధం చెయ్యమని అడుగుతున్నారట. ఒకవేళ రావడానికి కుదరకపోయినా.. ఫోన్ లోనే కథను నేరేట్ చెయ్యమని మరీ అడుగుతున్నారట.  మరోపక్క యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ ఇలాంటి సమయం కోసమే కాచుకుని కూర్చోవడంతో యంగ్ హీరోలు పిలవడమే పాపం.. లగెత్తుకుని కథలు చెప్పడానికి వెళ్తున్నారట.

Corona Virus: Good Time to Young directors:

Heroes wants New stories from directors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ