కరోనా కారణంగా సినిమా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయి దేశం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయిన సందర్భంలో రోజు వారీ కూలీల పరిస్థితి ఏంటన్నది ప్రతీ ఒక్కరికీ ఆందోళన కలిగిస్తుంది. పనిచేస్తేనే గానీ పైసలు చేతికి రానికి కొందరి జీవితాలని ఈ లాక్ డౌన్ తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తోంది. ఆ ఇబ్బందిని తప్పించి, వారి రోజువారి జీవితంలో ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి పెద్ద పెద్ద కళాకారులు తమవంతు సాయం చేస్తున్నారు.
రోజు వారి సినీ కార్మికులు ఇబ్బందులని తొలగించడానికి రజనీ కాంత్, సూర్య, కార్తి లాంటి హీరోలు తమవంతు సాయం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనాని అరికట్టడానికి చేస్తున్న కృషికి సాయంగా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇరవై లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి యాక్షన్ డైరెక్టర్ కూడా చేరిపోయాడు. సినిమానే నమ్ముకుని బతుకుతున్న వందలాది మంది కార్మికుల కోసం ఏర్పాటు చేసిన మనం సైతం ఫౌండేషన్ కి దర్శకుడు వివి వినాయక్ ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.
ఈ విషయాన్ని వివి వినాయక్ వీడియో రూపంలో తెలియజేశాడు. వినాయక్ లాగే మరికొంతమంది ముందుకు వస్తే మరింత బాగుంటుందని అంటున్నారు.