Advertisementt

RRR లేకపోతే టాలీవుడ్‌కి పండగే లేదు

Thu 26th Mar 2020 08:18 PM
rrr,motion poster,ugadi,festival,rajamouli,new movies  RRR లేకపోతే టాలీవుడ్‌కి పండగే లేదు
RRR gives Festival Mood to Fans RRR లేకపోతే టాలీవుడ్‌కి పండగే లేదు
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ఏదైనా ఫెస్టివల్ వచ్చింది అంటే పోలో మంటూ చిన్న పెద్ద సినిమా పోస్టర్స్, టీజర్స్ హంగామా పెద్ద ఎత్తున ఉంటుంది. చిన్న సినిమాలైనా, పెద్ద సినిమాలైనా తమ సినిమా పోస్టర్స్ తో అభిమానులను తృప్తి పరుస్తారు. చిన్న పండగైనా పెద్ద పండగైనా ఏ ఫెస్టివల్ ని వదలరు. కానీ ఈ ఉగాదికి ఏ సినిమా పోస్టర్ హడావిడి కనబడలేదు. కరోనా తో షూటింగ్స్ కి బ్రేక్ పడిన సినిమాలు.. కనీసం పోస్టర్స్ తోనూ హంగామా చెయ్యలేదు.

ఒక్క జక్కన్న ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ RRR టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ వదిలాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ సాలిడ్‌గా హంగామా చేసుకున్నారు. తమ హీరోలు సినిమాల పోస్టర్స్ కోసం ఎంతగానో ఎదురు చూసిన ఇతర హీరోల ఫాన్స్ ఉసూరుమంటే ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఫాన్స్ మాత్రం ఉగాది మొత్తం మాదే అంటూ హంగామా చేసారు. ప్రభాస్ జాన్ లుక్ కానీ, చిరు ఆచార్య లుక్స్ కానీ విడుదల కాలేదు. దానితో ప్రభాస్ ఫాన్స్ చిరు ఫాన్స్ కాస్త డిస్టర్బ్ అయినా.. రామ్ చరణ్ RRR లుక్ టైటిల్ తోనే మెగా ఫాన్స్ సరిపెట్టుకున్నారు. ఉగాది కానుకగా బోలెడన్ని పోస్టర్స్ సోషల్ మీడియాని దున్నేస్తాయని చాలామంది ఎదురు చూసారు. మరి ప్రేక్షకులకు సినిమాలే కాదు.. కనీసం పోస్టర్స్ తో అయినా హ్యాపీ ఇవ్వలేదు. ఇక ఉగాది కానుకగా భారి నుండి మీడియం సినిమాల విడుదల హడావిడి ఉండేది. కానీ ఈ ఉగాది షడ్రుచులు కాదు.. చాలా చప్పగా జరిగిందనే చెప్పాలి. దీనికి కారణం కరోనా ఎఫెక్ట్ అని అందరికి తెలుసు.

RRR gives Festival Mood to Fans :

Corona Effect: no festival mood at tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ