శ్రీను వైట్ల డైరెక్షన్‌లో తెరకెక్కిన చాలా సినిమాలు సూపర్ హిట్ అవడానికి కారణం అతని దగ్గర రైటర్ గా పని చేసిన కోన వెంకట్, గోపి మోహన్ లు... తర్వాత తర్వాత కోన వెంకట్ శ్రీను వైట్లకి కథలు అందించడం, మాటలు రాయడం మానేసిన తర్వాత శ్రీను వైట్లకి విజయమనేదే లేదు. ఇక ఇటు కోన వెంకట్ నిర్మాతగా దర్శకుడిగా ఓ అన్నంత సక్సెస్ అయితే లేదు. అయ్యితే శ్రీను వైట్లకి - కోన వెంకట్ కి మధ్యన గొడవ ఏమిటనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుబట్టని ప్రశ్నే. తాజాగా కోన వెంకట్, అలీతో సరదాగా ప్రోగ్రాంలో శ్రీనుకి తనకి ఎందుకు క్లాష్ వచ్చిందో అనేది రివీల్ చేసాడు.
కోన వెంకట్‌ని శ్రీను వైట్లకి మీకు మధ్యన క్లాష్ ఎందుకు వచ్చింది అనే అలీ అడిగిన ఇంట్రెస్టింగ్ ప్రశ్నకి కోన...టీం వర్క్ వల్లే సక్సెస్ వస్తుంది.. కానీ ఆ టీం వర్క్ ఎక్కడో బ్రేక్ అయ్యిందని నేను ఫీల్ అయ్యా.. దూరంగా ఉంటే మంచిదని కట్ చేశా.. అంటూ చాలా సింపుల్ గా శ్రీను వైట్లకి తనకి మధ్యన వచ్చిన విభేదాల గురించి చెప్పాడు. ఇక తాను రైటర్ అవడానికి కారణం ఆర్జీవీ అని, దర్శకుడు కావడానికి ఆర్జీవీ అని, ఇక రైటర్ కాకపోవడానికి కారణం కూడా ఆర్జీవినే అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు. ఇక ఆర్జీవిని తాను చాలా ముద్దుగా పప్పు అని పిలుస్తా అని చెబుతున్నాడు.