Advertisementt

దుమ్ము లేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు: చిరు

Fri 27th Mar 2020 03:36 PM
chiranjeevi,rrr,rrrmotionposter,bheemforramaraju,ntr,ramcharan  దుమ్ము లేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు: చిరు
Chiranjeevi tweeted about RRR దుమ్ము లేపారు.. మాలో ఉత్సాహాన్ని నింపారు: చిరు
Advertisement
Ads by CJ

ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ వచ్చిన రెండు రోజుల్లోనే మరో సర్ప్రైజ్ ఇచ్చాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ లోని ఒక్కో అక్షరానికి అర్థం చెప్పిన రాజమౌళి ఇప్పుడు తన సినిమాలోని పాత్రని పరిచయం చేశాడు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ పుట్టినరోజున అభిమానులెవ్వరూ మర్చిపోని గిఫ్ట్ ని ఇచ్చాడు. రాజమౌళి తయారు చేసిన ఈ గిఫ్ట్ ని కొమరం భీమ్  తన అన్న రామరాజుకి అందించాడు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో స్వంతంగా డబ్బింగ్ చెప్పిన ఎన్టీఆర్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

వీడియో మొత్తానికి రామ్ చరణ్ ఒక హైలైట్ అయితే ఎన్టీఆర్ వాయిస్ మరో హైలైట్. ఆ గొంతులోని గాంభీర్యానికి ప్రతీ ఒక్కరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ గిఫ్ట్ ట్రెండింగ్ లో నడుస్తుంది. టాలీవుడ్ సెలెబ్రిటీలు అందరూ ఈ గిఫ్ట్ ని చూసి మురిసిపోతున్నారు. ఇక ఉగాది పర్వదినాన సోషల్ మీడియాలో జాయిన్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఈ వీడియోపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. రాజమౌళి అంబులపొదిలోంచి వదిలిన రామబాణం ఈ సీతారామరాజు అంటూ కామెంట్ చేసి వీడియో రిలీజ్ చేసి దుమ్ములేపడమే కాదు మాలో ఉత్సాహాన్ని నింపారని చెప్పాడు.

చిరంజీవి ట్విట్టర్ లో జాయిన్ అయినప్పటి నుండి చాలా ఆక్టివ్ గా ఉంటున్నాడు. కరోనా కారణంగా సామాజిక దూరం పాటించమని చెప్పడంతో సోషల్ మీడియా ద్వారా ఆయన అభిప్రాయాలని పంచుకుంటూ... అభిమానులకి ఆనందాన్ని పంచుతున్నాడు.

Chiranjeevi tweeted about RRR :

Chiranjeevi responds on bheem gift for Ramcharan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ