కరోనా కారణంగా భారతదేశం అంతటా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ నడుస్తున్నన్ని రోజులు జనాలు ఎవ్వరూ ఇళ్ళలోకి రావొద్దని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారు. తెలంగాణలో అయితే జనాలు వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు కూడా ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇళ్లకే పరిమితమైన వారందరూ తమ తోచిన పనిచేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు.
ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ టైమ్ ని బాగా వాడుకుంటుందట. సినిమా షూటింగులు, టీవీ షూటింగులు అన్నీ ఆగిపోవడంతో దూరదర్శన్ లో రామాయణ, మహాభారత సీరియళ్ళని కేంద్రప్రభుత్వం ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ సీరియల్ ని చూస్తూ కాలం గడుపుతుందట. చిన్నప్పుడెప్పుడో చూసిన సీరియళ్ళని ఇలా మళ్ళీ ఇంట్లో అందరితో కలిసి చూస్తుండడంతో మళ్ళీ చిన్నతనానికి వెళ్ళినట్లు ఉందట.
ఈ విషయాన్ని సొషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది కాజల్. ప్రస్తుతం కాజల్ చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. కమల్ హాసన్ ఇండియన్ ౨, మెగాస్టార్ ఆచార్య, అలాగే ఇంగ్లీష్, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న మోసగాళ్ళు చిత్రంలోనూ నటిస్తుంది.