Advertisementt

RRR: రామరాజు ఫర్ భీమ్...ఆ రోజునే..?

Sat 28th Mar 2020 01:47 PM
rrr,bheemforramaraju,rajamouli,ntr,ramcharan  RRR: రామరాజు ఫర్ భీమ్...ఆ రోజునే..?
RRR: Ramaraju for bheem on that day..? RRR: రామరాజు ఫర్ భీమ్...ఆ రోజునే..?
Advertisement
Ads by CJ

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఆర్ ఆర్ ఆ నుండి ఎప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్న సమయంలో సడెన్ గా రాజమౌళి మోషన్ పోస్టర్ ని వదిలి ఆశ్చర్యపరిచాడు. మోషన్ పోస్టర్ ని వదిలిన రెండు రోజుల్లోనే రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ని వదిలాడు. మన్నెం దొరగా రామ్ చరణ్ కి అందరూ ఫిదా అయ్యారు. ఈ లుక్ ని వీడియో రూపంలో ప్రెజెంట్ చేసిన రాజమౌళి దీన్ని కొమరంభీమ్ రామరాజుకి ఇచ్చే బహుమతిగా అభివర్ణించాడు. ఈ సినిమాలొ ఈ రెండు పాత్రల మధ్య మంచి దోస్తీ ఉంటుందని ఇంతకుముందే చెప్పాడు.

రామ్ చరణ్ కి వచ్చిన బహుమతి అందరికీ బాగా నచ్చేసింది. ఇక ఇప్పుడు అందరూ రామరాజు భీమ్ కి ఇచ్చే బహుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ బహుమతిని ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న రామరాజు ఇస్తాడని, అప్పుడు రామరాజు ఫర్ భీమ్ గా ఈ గిఫ్ట్ ఉంటుందని చెబుతున్నారు. అయితే రామరాజుని నిప్పుగా అభివర్ణించిన రాజమౌళి... వీడియోలో ఎక్కువగా నిప్పుని చూపిస్తూ రగిలే నిప్పుకణంగా చూపించాడు. ఎన్టీఆర్ ని నీరుతో పోల్చాడు కాబట్టి రామరాజు ఇచ్చే గిఫ్ట్ సునామీలా ఉంటుందని చెబుతున్నారు. 

RRR: Ramaraju for bheem on that day..?:

Ramaraju going to give a gift on may 20th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ