రాజమౌళి కరోనా కరతాళ నృత్యం చేస్తున్న టైం లో ఇండియా మొత్తం కూల్ గా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా RRR టైటిల్ తో పాటుగా మోషన్ పోస్టర్ వదిలాడు. RRR సినిమా నుండి టైటిల్ గా రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని వదిలాడు. అయితే టైటిల్ పై ఎక్కడో ఏదో అనుమానం ఉన్నప్పటికీ... తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజునాడు రాజమౌళి ఇచ్చిన మెగా ట్రీట్ మాములుగా లేదు. రామ్ చరణ్ ని ఓ రేంజ్ లో అల్లూరి సీతారామరాజుగా చూపించాడు. రామ్ చరణ్ లుక్ చూసిన మెగా ఫాన్స్ కి పిచ్చెక్కేసింది. మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు... ఎన్టీఆర్ అభిమానులకు కూడా అల్లూరి లుక్ లో రామ్ చరణ్ లుక్ చూసి పిచ్చెక్కింది.
దానితో ఎన్టీఆర్ బర్త్ డే కి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ పై అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ని ఎంత స్పెషల్ గా చూపిస్తారో RRR నుండి ఎన్టీఆర్ లుక్ పై భీభత్సమైన అంచనాలు.. భీభత్సమైన హైప్ కోసం ఎన్టీఆర్ అభిమానులు అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ షురూ చేసారు. రామ్ చరణ్‌ని అల్లూరి లుక్ లో చూసి మెగా ఫాన్స్ కడుపునిండిపోయింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ పోలీస్ లుక్ లో కండలు తిరిగి.. విల్లు సందిస్తుంటే అబ్బబ్బ మాములుగా రాలేదు. మరి రామ్ చరణ్ నే అంత అద్భుతంగా పవర్ ఫుల్ గా చూపిస్తే... ఎన్టీఆర్ ని మరెంత అద్భుతంగా పవర్ ఫుల్ గా చూపిస్తారో అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ లుక్ పై తెగ హోప్స్ పెంచేసుకుంటున్నారు. మరి మే లో ఎన్టీఆర్ ఫాన్స్ కి డబుల్ ట్రీట్ రాజమౌళి ఇవ్వబోతున్నారు. మరి రామ్ చరణ్ పుట్టిన రోజుకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామ్ చరణ్ యాక్షన్ చూపించిన రాజమౌళి ఎన్టీఆర్ పుట్టినరోజుకి రామ్ చరణ్ వాయిస్ తో ఎన్టీఆర్ యాక్షన్ చూపిస్తాడని ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.