ప్రస్తుతం కరోనాతో దేశం మొత్తం ఇంట్లోనే కూర్చున్నారు. సెలబ్రిటీసే కాదు.. సామాన్య జనం ఎవరైనా ఇంటికే పరిమితమవుతున్నారు. కేవలం పోలీస్‌లు, డాక్టర్స్, పారిశుధ్య కార్మికులు తప్ప మిగతా వారంతా ఇంట్లోనే ఉండిపోతున్నారు. అయితే హీరోలు చాలామంది వంటలు గింటలు అంటూ ఏవో ప్రయత్నాలు చేస్తుంటే.. హీరోయిన్స్ మాత్రం జిమ్ వర్కౌట్స్ తో హాట్ హాట్ గా ఇంట్లోనే తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కరోనాపై ఉన్న రూల్స్‌ని పాటిస్తూనే ఈ గ్యాప్‌ని అటు రాజకీయాలతోనూ ఇటు సినిమా పనులతోను కానిచ్చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తయ్యింది. కానీ కరోనాతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు కాబట్టి వకీల్ సాబ్ లో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నాడట. దానికి సంబంధించిన డబ్బింగ్ ఎక్విప్మెంట్ అంతా ఇంటికే తెప్పించుకుని అసిస్టెంట్ డైరెక్టర్స్ సహాయంతో పవన్ కళ్యాణ్ తన పాత్ర డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడట, ఇక కరోనా టైం పూర్తి కాగానే మళ్లీ మిగతా షూటింగ్ కూడా పూర్తి చేస్తాడట. మరోపక్క హరీష్ స్క్రిప్ట్ ఫోన్‌లోనే విని ఓకే చేస్తున్నాడట. ఏమన్నా మార్పులు చేర్పులు కూడా హరీష్‌కి ఫోన్ లోనే సూచిస్తున్నాడట పవన్ కళ్యాణ్. మరోపక్క వేణు శ్రీరామ్ కూడా ఎడిటింగ్, మిగతా పాత్రల డబ్బింగ్ పనులను చూసుకుంటున్నాడట.