Advertisementt

వెంకీ అట్లూరి మ్యాజిక్ చేయగలడా..?

Sun 29th Mar 2020 12:37 PM
rangde,nithin,mahanati,keerthy suresh,devisri prasad,sithara entertainments  వెంకీ అట్లూరి మ్యాజిక్ చేయగలడా..?
Will Venky Atluri do magic with rang d..? వెంకీ అట్లూరి మ్యాజిక్ చేయగలడా..?
Advertisement
Ads by CJ

తెలుగులో ప్రేమ కథా చిత్రాలు తీసే దర్శకులు చాలా మంది ఉన్నారు. సినిమా కథాంశం ఏదైనా అందులో ప్రేమ అనే పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. సినిమాలు చూసేవాళ్లలో ఎక్కువగా యూత్ ఉంటారు కాబట్టి దర్శకులు అలాంటి కథలనే ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటారు. హీరోలు కూడా ప్రేమ కథా చిత్రాల్లోనే ఎక్కువగా కనబడతారు. అయితే ఈ రోజు యంగ్ హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం రంగ్ దే మోషన్ పోస్టర్ ని వదిలింది చిత్ర బృందం.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీ గతంలో వరుణ్ తేజ్ తో తొలిప్రేమ అనే చిత్రాన్ని తీశాడు. ఆ చిత్రం ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో తీసిన మిస్టర్ మజ్ను బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. తెరకెక్కించిన రెండు ప్రేమ కథా చిత్రాలలో ఏ ఒక్కటీ బ్లాక్ బస్టర్ అనిపించుకోలేదు.

ఇలాంటి టైమ్ లో ఎవ్వరైనా కొంచెం రొటీన్ కి విభిన్నంగా ఉండే కథాంశాలని ఎంచుకుంటారు. కానీ వెంకీ మళ్ళీ రంగ్ దే అంటూ లవ్ స్టోరీతోనే వస్తున్నాడు. మహానటి సినిమాతో ఇండియావైడ్ గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి ముచ్చటగా మూడవ సారి ప్రేమ కథాచిత్రంతో వస్తున్న వెంకీ ఈ సారైనా మ్యాజిక్ చేయగలడా అని సందేహంగా ఉంది. అందరూ దిగ్గజాలు పనిచేస్తున్న ఈ సినిమా ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి.

Will Venky Atluri do magic with rang d..? :

Will  Venky Atluri do magic with Rang de  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ