Advertisementt

ఆ సినిమా మీదే నా భవిష్యత్తు.. మంచు విష్ణు

Tue 31st Mar 2020 12:37 PM
manchu vishnu,mosagaallu,kajal,hollywood  ఆ సినిమా మీదే నా భవిష్యత్తు.. మంచు విష్ణు
My future dependes on that movie ఆ సినిమా మీదే నా భవిష్యత్తు.. మంచు విష్ణు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఎందరో కుటుంబ వారసులున్నారు. అయితే వారసత్వంగా వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్స్ అయిపోలేదు. చాలామంది ఇప్పటికీ హిట్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే అలా హిట్ కోసం చూసేవారిలో మంచు విష్ణు కూడా ఒకరు. విష్ణుకి ఢీ సినిమా మినహాయిస్తే మళ్ళీ అంతటి రేంజ్ ఉన్న సినిమా పడలేదు. ఆయన చివరగా నటించిన ఆచారి అమెరికా యాత్ర బాక్సాఫీసు వద్ద ఘోరంగా డిజాస్టర్ అయింది.

అయితే అప్పటి నుండి చాలా గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు ఇంటర్నేషనల్  సినిమా మోసగాళ్ళుతో మన ముందుకు వస్తున్నాడు. హాలీవుడ్ నిపుణులతో  తెలుగు, ఇంగ్లీష్ భాషల్లోనూ తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించింది. రెండు వేల ఐదు వందల కోట్ల ఐటి స్కామ్ గురించి చెప్పబోతున్న ఈ సినిమా మీద విష్ణుకి బాగా నమ్మకం ఉందట. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని బాగా నమ్ముతున్నాడు.

ఇంగ్లీష్, తెలుగులో రెండు వేర్వేరు వెర్షన్లలో వస్తున్న ఈ సినిమా మొదటగా తెలుగులో విడుదల అవుతుందట. ఆ తర్వాత ఇంగ్లీష్ వెర్షన్ ని ఫెస్టివల్ కి పంపాక రిలీజ్ చేస్తాడని చెప్పాడు. అయితే ఈ సినిమా తర్వాతే తన ఫ్యూఛర్ సినిమాల సంగతి తేలుస్తాడట. అప్పటి వరకు తన కాన్ సన్ ట్రేషన్ అంతా మోసగాళ్ళు పైనే పెట్టాడట.

My future dependes on that movie:

Mosagaallu wil be  super hit

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ