చైనాలోని వుహాన్ నగరంలో జంతువుల మార్కెట్ లో పుట్టిదని చెప్పబడుతున్న కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇండియా సహా చాలా దేశాలు కరోనా నుండి తమని తాము కాపాడుకోవడానికి లాక్ డౌన్ ని విధించాయి. ఇంతవరకు వ్యాక్సిన్ కనుక్కోలేని ఈ వైరస్ ప్రపంచాల్ని గడగడా వణికిస్తోంది. అయితే ఇదంతా చైనా నిర్లక్ష్యం వల్లే జరిగిందని కొందరు..లేదు లేదు కావాలనే చైనా ఇలా చేసిందంటూ వార్తలు వస్తున్నాయి.
కరోనా వైరస్ మనుషుల నుండి మనుషులకి వ్యాపిస్తుందని తెలిసి కూడా ప్రపంచానికి తెలియజేయలేదని.. అదీ గాక ఆ విషయం తెలిసి కూడా ప్రపంచ దేశాలకి చైనా నుండి ఏడు మిలియన్ల మందిని పంపించారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది చైనాపై దుమ్మెత్తి పోస్తున్నారు. జంతువులని తినే అలవాట్లున్న వారిని తిట్టిపోస్తున్నారు. ఇలా తిట్టేవారిలో బాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా చేరారు.
సాథియా సినిమాలో నటించిన సంధ్యా మ్రిదుల్ చైనా వారిపై ఎన్నో మాటలు మాట్లాడింది. జంతువులనే కాదు మిమ్మల్ని మీరే తినండంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఒక్కత్తే కాదు ఇలా చైనాని తిట్టేవారు చాలా మంది ఉన్నారు. అన్నిదేశాల్లో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో మాత్రం లాక్ డౌన్ ని ఎత్తివేస్తే ఇలాంటి మాటలే వస్తాయని ఆమెను సపోర్ట్ చేస్తున్నవాళ్లు ఉన్నారు.