డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథలు చాలా వేగంగా రాస్తారు. కేవలం వారం రోజుల్లోనే ఒక సినిమా స్క్రిప్టుని పూర్తి చేయగల సత్తా ఉన్న దర్శకుడాయన. బిజినెస్ మేన్ వంటి సూపర్ హిట్ మూవీని కేవలం రెండు నెలల్లో తెరకెక్కించాడంటే ఆయన టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటింగ్ నేపథ్యంలో సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు.
అయితే ఈ టైమ్ లో పూరి మరో కథని సిద్ధం చేస్తున్నాడట. ఇప్పటికే పూరి దగ్గర చాలా కథలు ఉన్నాయి అయినా కరోనా వల్ల దొరికిన ఫ్రీ టైమ్ ని మరో కథ రాయడానికి ఉపయోగిస్తున్నాడట. ఈ కథలో చిరంజీవిని హీరోగా అనుకుంటున్నాడట. గతంలో చిరంజీవితో సినిమా చేద్దామని పూరి జగన్నాథ్ చాలా ప్రయత్నించాడు. ఆటోజానీ అనే కథ అనే టైటిల్ తో ఓ మాస్ మసాలా చేయాలని.... ఆ కథని చిరంజీవికి కూడా వినిపించాడు.
కానీ కథ నచ్చకపోవడంతో చిరంజీవి ఓకే చేయలేదు. మరి అప్పుడు ఒప్పుకోని చిరంజీవి ప్రస్తుతం పూరి రాస్తున్న కథని ఒప్పుకుంటాడో లేదో చూడాలి. చిరంజీవికి సెట్ అయ్యే కథ రాస్తున్న పూరి ఆయనని మెప్పించేలా చేస్తాడో లేదో చూడాలి. మొత్తానికి కరోనా టైమ్ ని పూరి బాగానే వాడుకుంటున్నాడు.