తెలుగులో స్టార్ హీరోయిన్ అని కొన్ని రోజులైనా అనిపించుకోకముందే రకుల్ ప్రీత్ సింగ్ కి వరుస ఫ్లాపుల్ వచ్చి పడ్డాయి. నాగార్జునతో నటించిన మన్మధుడు ౨ సినిమా తర్వాత ఆమె పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆ సినిమా తర్వాత తెలుగులో మళ్ళీ ఆమెకి అవకాశమే రాలేదు. ప్రస్తుతం ఆమె నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటించనుందని సమాచారం.
ఒకప్పుడు స్టార్ హీరోల సరసన చేసిన రకుల్.. బాలీవుడ్ లోనూ అవకాశాలు తెచ్చుకుంది. కానీ అక్కడ కూడా ఆమెకి విజయాలు దక్కలేదు. అయితే ప్రస్తుతం తెలుగులో స్థిరపడడానికి ఆమెకి ఉన్న ఒకే ఒక్క అవకాశం నితిన్ సినిమానే. ఈ సినిమా మీద బాగా ఆశలే పెట్టుకుందట. అయితే ఈ సినిమా రావడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ప్రస్తుతం నితిన్ చేసున్న రంగ్ దే చిత్రంతో ఆయన లిస్ట్ లో ఉన్న అంధాధున్ రీమేక్ కూడా చేయాల్సి ఉంది.
అవన్నీ అయ్యాక కానీ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో సినిమా తెరకెక్కదు. అంటే మరో సంవత్సరం అయ్యాక కానీ రకుల్ తెలుగు సినిమాలో కనబడదని అర్థం అవుతుంది. మరి సంవత్సరం తర్వాతైనా రకుల్ ఈ సినిమాతో హిట్ తెచ్చుకుంటుందా లేదా చూడాలి.