పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడని తెలిసినప్పటి నుండి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలని ప్రకటించేశాడు. వాటిల్లో రెండు చిత్రీకరణ కూడా జరుపుకుంటున్నాయి. కరోనా కల్లోలం కారణంగా షూటింగ్స్ వాయిదా పడ్డాయి. ఒక్కసారి లాక్ డౌన్ ముగియగానే ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటాయి.
అయితే పవన్ క్రిష్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాపై ఆసక్తికరమైన కథనాలు బయటకి వస్తున్నాయి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడట. మొఘలుల కాలం నాటి కథతో వస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కేరీర్లోనే అతి ఎక్కువ బడ్జెట్ తో తీస్తున్న చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో స్పెషల్ నంబర్ కూడా ఉందట.
ఆ స్పెషల్ సాంగ్ తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేయనుందట. పూర్తి కమర్షియల్ హంగులతో క్రిష్ ఈ సినిమాని పవన్ అభిమానులకి ఫీస్ట్ గా తీర్చి దిద్దుతున్నాడట. మరి ఈ స్పెషల్ నంబర్ పై వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమో వారికే తెలియాలి. పూజిత పొన్నాడ రంగస్థలం సినిమాలో ఆది పనిశెట్టి లవర్ పాత్రలో నటించింది.