కరోనా మహమ్మారి విస్తరిస్తు్న్న నేపథ్యంలో.. మరోవైపు లాక్‌డౌన్ ఉండటంతో కార్మికులు, పేద ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ విషయానికొస్తే జగన్ సర్కార్.. ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయిలు, రేషన్ సరుకులు.. కేంద్ర ప్రభుత్వం తరఫున జన్‌ధన్ ఖాతాలో పేదప్రజలకు 500 రూపాయిలు నేరుగా పడుతున్నాయి. అయితే ఈ విషయం తెలియక.. అర్థం చేసుకోలేక చాలా మంది ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారం జగన్ ప్రభుత్వాన్ని తిట్టిపడేస్తున్నారు. అయితే ఈ కోవలేకే మెగా బ్రదర్ నాగబాబు కూడా చేరిపోయాడు. అసలు విషయం తెలియక.. అందరూ తిట్టేస్తు్న్నారు.. జనసేన తరఫున మనమూ తిట్టేస్తే పోలా అనుకున్నాడేమో గానీ.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును టార్గెట్‌గా చేసుకుని ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్ల వర్షం కురిపించాడు. అయితే.. అస్సలు తగ్గేదే లేదు.. ఎందుకు తగ్గాలి అన్నట్లుగా రాంబాబు సైతం స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. వీరిద్దరి మధ్య వివాదాస్పద హాట్ నటి శ్రీరెడ్డి దూరింది. ఆమె కూడా మెగాబ్రదర్‌ను తిట్టి పోసింది. ఇంతకీ వీరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఒకసారి చూద్దాం.
నాగబాబు ట్వీట్స్ ఇవీ..
‘దేవుడా.. ఇక ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోగ్యం నువ్వే కాపాడాలి. మన చేతుల్లో లేదు. ఈ రోజు అంబటి గారి కోసం కూడా నేను దీపం వెలిగిస్తాను.. ఆయన ఆరోగ్యం బాగుపడితే అమ్మోరికి తలనీలాలు సమర్పిస్తాను.. నావి కాదు..అంబటి గారి తల నీలాలు. ఒక విన్నపం.. కేంద్రం కరోనా అకౌంట్‌లో పేదలకు ఇచ్చే రూ. 1000 వైసీపీ ప్రభుత్వం వారు ఇస్తున్నట్లు మీ నాయకులు బిల్డప్ ఇచ్చి రాబోయే ఎలక్షన్స్‌లో ఓట్లు అడుగుతున్నారు.. అది ఆపండి సర్. లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకొనే బాచ్ అంటారేమో..? అని నా ఫీలింగ్’ అని మీడియా మీట్ పెట్టిన అంబటిని ఉద్దేశించి నాగబాబు ట్వీట్స్ చేశాడు.
అంబటి స్ట్రాంగ్ కౌంటర్..
‘బీజేపీలో చేరిన కొత్త నీరు అంత కూడా మొన్నటి నుండి ఒకటే అరవడం!. కేంద్రం ఇచ్చిన డబ్బులు 1000 రూ అని ఇదిగొండి కేంద్రం ఇచ్చిన డబ్బులు సరాసరి అకౌంట్లలోకి జమ అయింది (స్క్రీన్ షాట్ చూపిస్తూ). కాస్తన్న వాడండి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పిచ్చి పచ్చ రాజకీయ అవాస్తవాల ప్రచారం ఆపండి’ అని నాగబాబు, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని అంబటి ట్యాగ్ చేశారు.
శ్రీరెడ్డి పోస్ట్ ఇదీ..
‘అంబటి రాంబాబుతోనే పంచ్‌లా.. నాగబాబుకు గొంతు సెట్ అయింది. కానీ.. బుద్ధీ సెట్ అవ్వలేదు’ అని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్‌కు పలువురు మద్దతుగా మాట్లాడుతుండగా.. మరికొందరు మాత్రం శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇలా అస్తమాను మెగా ఫ్యామిలీని గోకడం.. మెగాభిమానులు, జనసేన కార్యకర్తలతో తిట్టించుకోవడం శ్రీరెడ్డికి కొత్తేమీ కాదన్న విషయం విదితమే.