Advertisementt

సాహో డైరెక్టర్ పై చిరుకి అంత నమ్మకం ఏంటో..?

Fri 10th Apr 2020 02:39 PM
chiranjeevi,sujeeth,ramcharan,lucifer  సాహో డైరెక్టర్ పై చిరుకి అంత నమ్మకం ఏంటో..?
Why chiranjeevi giving opportunity to him..? సాహో డైరెక్టర్ పై చిరుకి అంత నమ్మకం ఏంటో..?
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి తర్వాతి సినిమాగా మళయాల చిత్రమైన లూసిఫర్ రీమేక్ చేయడానికి హక్కులు కొనుక్కున్నాడు. అయితే హక్కులైతే కొనుక్కున్నాడు గానీ, దాన్ని తెరకెక్కించే దర్శకుడు ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. మొన్నటి వరకు దర్శకుడిగా వివి వినాయక్, హరీష్ శంకర్, సుకుమార్ వంటి పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ అవకాశం సాహో దర్శకుడు సుజిత్ కి దక్కిందట.

సాహో సినిమా బాలీవుడ్ లో కలెక్షన్లు సాధించింది గానీ, తెలుగులో మాత్రం ఫ్లాప్ప్ టాక్ తెచ్చుకుంది. స్టైల్ పరంగా సినిమా బాగుందని ప్రశంసలు వచ్చినప్పటికీ, కథా పరంగా చాలా వీక్ అని విమర్శలు వచ్చాయి. మరి ఇలాంటి ఫ్లాప్ దర్శకుడికి చిరు అవకాశం ఎందుకు ఇచ్చాడో అర్థం కాని ప్రశ్న. అయితే లూసిఫర్ ని చాలా స్టైలిష్ గా తీయాలని అనుకుంటున్నారట. అలా తీయగల దర్శకుల కోసం వెంటాడితే వారికి సుజిత్ కనిపించాడు.

సాహో సినిమా కథా పరంగా వీక్ అవ్వొచ్చు. కానీ చాలా లావిష్ గా తెరకెక్కించాడు. ఆ సినిమా స్తైలిష్ మేకింగ్ నచ్చిన చిరంజీవి సుజిత్ ని పిలిపించాడట. ప్రస్తుతం సుజిత్ లూసిఫర్ ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నాడు. స్క్రిప్ట్ మొత్తం పూర్తయ్యాక చిరంజీవి ఓకే చెప్పేస్తే సుజిత్ కి మంచి అవకాశం లభించినట్టే.

Why chiranjeevi giving opportunity to him..?:

Sujith readying dcript for Chiranjeevi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ