Advertisementt

RRR: అజయ్ దేవగణ్ పాత్ర గురించి తెలుసా..?

Sat 11th Apr 2020 04:31 PM
rrr,ramcharan,ntr,rajamouli,ajay devgan,alia bhat  RRR: అజయ్ దేవగణ్ పాత్ర గురించి తెలుసా..?
Interesting update from RRR RRR: అజయ్ దేవగణ్ పాత్ర గురించి తెలుసా..?
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా కొమరంభీమ్ ఇచ్చిన గిఫ్ట్ రామ్ చరణ్ అభిమానులతో పాటు ఎన్టీఆర్ అభిమానులకి విపరీతంగా నచ్చేసింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజుని చూసిన తర్వాత కొమరంభీమ్ ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి బాగా పెరిగింది. అయితే ఈ సినిమా నిజజీవిత పాత్రలతో కల్పిత కథగా తెరకెక్కుతుందని రాజమౌళి చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే నిజజీవితంలో అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ కలుసుకున్నట్లు దాఖలాలు లేవు. కానీ వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్.. 1920 ప్రాంతంలో ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే. ఆ సమయంలో వారు ఎక్కడికి వెళ్లారన్న విషయం ఎవరికీ తెలియదు. ఈ పాయింట్ ని తీసుకునే రాజమౌళి కథ రాసుకున్నాడని సమాచారం. అయితే సినిమాలో రామరాజుని, కొమరంభీమ్ ని ఎలా కలుపుతారాన్న విషయమై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

వీరిద్దరూ ఇంటి నుండి పారిపోయి స్వాతంత్ర్య సమరయోధుడి దగ్గరకి చేరుకుంటారట. ఆ యోధుడి ద్వారా స్ఫూర్తి పొంది స్వాతంత్ర్య కాంక్ష కలుగుతుందట. ఆ స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో అజయ్ దేవగణ్ కనిపిస్తాడని అంటున్నారు. స్వాతంత్ర్య పోరాట యోధుడిగా అజయ్ దేవగణ్ పాత్ర ఎమోషనల్ గా ఉంటుందట. ఈ లెక్కన చూస్తే అజయ్ దేవగణ్ కి మంచి పాత్రే దక్కింది.

Interesting update from RRR:

Ajay Devgan role in  RRR

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ