Advertisementt

‘పుష్ప’ కోసం పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నారు

Sat 11th Apr 2020 11:17 PM
pushpa,allu arjun,villain role,pan india film,bollywood actor  ‘పుష్ప’ కోసం పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నారు
Bollywood Actor in Bunny Pushpa Villain role ‘పుష్ప’ కోసం పాన్ ఇండియా స్కెచ్ వేస్తున్నారు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ -సుకుమార్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోతున్న పుష్ప సినిమా ఫస్ట్ లుక్ తోనే అన్ని భాషల ప్రేక్షకులను షేక్ చేసింది. అల్లు అర్జున్ మాస్ అండ్ రఫ్ లుక్ అదిరిపోయింది. డీ గ్లామరస్ గా హెయిర్ పెరిగిపోయి.. చాలా రఫ్ గెడ్డం తో అల్లు అర్జున్ మాస్ లుక్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా లెవల్లో సినిమా అంటే దానికి పాన్ ఇండియా క్రేజ్ కావాలి. కాబట్టే ఈ సినిమాకి అన్ని భాషల నుండి నటుల ఎంపిక చేపడుతున్నాడట సుకుమార్. ఇప్పటికే తమిళం నుండి విజయ్ సేతుపతి, అల్లు అర్జున్ కోసం పుష్ప విలన్ గా దింపుతున్నారనే ప్రచారం ఉంది.

కానీ తాజాగా విజయ్ సేతుపతి పుష్ప కి విలన్ కాదని.. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర అంటే పోలీస్ కమిషనర్ పాత్రలో అల్లు అర్జున్ కి సహాయపడే కేరెక్టర్ చేస్తున్నాడట. అయితే విలన్ గా మాత్రం బాలీవుడ్ అప్పీల్ తీసుకురాబోతున్నారట. బాలీవుడ్ లో సంజత్ దత్ కానీ... అజయ్ దేవగన్ ని కానీ విలన్ గా తీసుకోవాలని అల్లు అర్జున్ తో పాటుగా సుక్కు భావిస్తున్నాడట. జాకీ షరిఫ్ అయినా ఓకె కానీ.. సునీల్ శెట్టి వద్దనుకుంటుందట టీం. ఎందుకంటే రజినీకాంత్ దర్బార్ లో సునీల్ శెట్టి విలనిజం అంతగా ప్రేక్షకులకు ఎక్కలేదని.. కాబట్టి బాలీవుడ్ నుంచి ఇంకా ఎవరినైనా బన్నీకి విలన్ గా తేవాలనుకుంటున్నారట.

Bollywood Actor in Bunny Pushpa Villain role :

Pushpa team searched for Bollywood actor to Villain role

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ