Advertisementt

అమ్మవల్లే నేను యాక్టర్ అయ్యాను..

Mon 13th Apr 2020 12:24 PM
rao ramesh,tollywood,rao gopal rao,telugu,character artist  అమ్మవల్లే నేను యాక్టర్ అయ్యాను..
I became actor because of my mother.. అమ్మవల్లే నేను యాక్టర్ అయ్యాను..
Advertisement
Ads by CJ

సినిమాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకటి ఊహించుకుంటే మరోటి జరుగుతుంది. ప్రేక్షకుడి ఊహకి అందకుండా కథను మలుపు తిప్పడానికే దర్శకులు తపన పడుతుంటారు. అయితే సినిమాలే కాదు సినిమా వారి జీవితం కూడా అలాగే ఉంటుందనిపిస్తుంది. సినిమా రంగానికి వచ్చిన చాలా మంది ఒక గమ్యంతో వస్తే.. సినిమా వారిని మరో గమ్యానికి చేరుస్తుంది. చాలా మంది హీరోయిన్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్తుండడం వింటునే ఉంటాం.

అయితే టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరైన రావు రమేష్ యాక్టర్ కావాలని అనుకోలేదట. డైరెక్టర్ గా స్థిరపడదామని కలలు కన్నాడట. ఈ విషయాన్ని వాళ్ల అమ్మతో పంచుకుంటే, డైరెక్టర్ గా ఎదగాలంటే 24 విభాగాల పట్టు ఉండాలి. అందుకే నువ్వు యాక్టర్ గా ట్రై చేయమని చెప్పిందట. అమ్మ మాట విన్న రావు రమేష్ యాక్టర్ గా అవకాశాల కోసం ప్రయత్నించాడు. 

మొదటగా చిన్న చిన్న పాత్రలు చేసిన రావు రమేష్ కి కొత్త బంగారు లోకం సినిమాలోని లెక్చరర్ పాత్ర ద్వారా మంచి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో బిజీ యాక్టర్ అయిపోయాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, విలన్ గా పాత్రలు చేస్తూ మనకి వినోదం పంచుతూనే ఉన్నాడు. 

I became actor because of my mother..:

he became actor because of his mother

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ