Advertisementt

పవన్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ తప్పదా?

Tue 14th Apr 2020 06:02 PM
pawan kalyan,sack,2 films,vakeel saab,krish,harish shankar,pawan films  పవన్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ తప్పదా?
Pawan Won’t Do Those Two Films! పవన్ ఫ్యాన్స్‌కి మళ్లీ నిరాశ తప్పదా?
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ క్రేజ్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్‌ని సినిమాల్లో ఆదరించినట్లుగా రాజకీయాల్లో ఆదరించలేదు. రాజకీయాల్లో జీరోగా మిగిలిన పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అటు రాజకీయం రాజకీయమే. ఇటు సినిమా సినిమానే అన్నాడు. వరసబెట్టి మూడు సినిమాలకు సైన్ చేసేసాడు. మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయంటున్నారు.

వేణు శ్రీరామ్‌తో వకీల్ సాబ్, క్రిష్ తో విరూపాక్ష, హరీష్ శంకర్ సినిమాతో పాటుగా పూరి, త్రివిక్రమ్ సినిమాలు పవన్ చేస్తాడనే టాక్ ఉంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ముచ్చటగా మూడు సినిమాలతోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడని టాక్ వినబడుతుంది. ఈ మూడు సినిమాల తరవాత పవన్ కళ్యాణ్ ఇక సినిమాలకు సైన్ చెయ్యడనేది తాజా న్యూస్. మరి పవన్ కళ్యాణ్ కోసం బోలెడంతమంది నిర్మాతలు వెయిటింగ్. మరోపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెర్రెక్కిపోయి ఉన్నారు. పవన్ సినిమాల్లోకి రావడం ఫ్యాన్స్‌కి ఎక్కడాలేని సంతోషం తెచ్చింది.

కానీ మళ్ళీ పవన్ సినిమాలకు ఫుల్ స్టాప్ పెడితే ఎలా అంటూ ఫ్యాన్స్ తెగ ఇదైపోతున్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా రాజకీయాలకు, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన పవన్ ఈ లాక్ డౌన్ ముగియగానే సినిమాలను చకచకా పూర్తి చేయి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్లిపోవడానికి చూస్తున్నాడట. అందుకే సినిమాలకు మళ్ళీ బ్రేక్ ఇవ్వబోతున్నాడట. 

Pawan Won’t Do Those Two Films!:

Lockdown Effect: Pawan Sacks 2 Films!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ