Advertisementt

రాశి ఖన్నా, తమన్నా లైన్‌లోకి వచ్చారు

Tue 14th Apr 2020 06:17 PM
heroine,raashi khanna,tamanna,lessons,corona lessons  రాశి ఖన్నా, తమన్నా లైన్‌లోకి వచ్చారు
Corona lessons from Raashi Khanna and Tamanna రాశి ఖన్నా, తమన్నా లైన్‌లోకి వచ్చారు
Advertisement
Ads by CJ

ప్రస్తుతం 21 రోజుల కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు, సెలబ్రిటీస్..మరో 19 రోజులు పాటు లాక్ డౌన్ లో ఉండాలంటూ నరేంద్ర మోడీ గారు చెప్పారు. పీఎం మోడీ ఈ రోజు ఉదయం లాక్ డౌన్ మరో 19 రోజులు పాటు దేశమంతటా పొడిగిస్తున్నట్టుగా ప్రకటన చేసారు. అయితే ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీస్ ఖాళీ సమయంలో ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు సోషల్ మీడియా టచ్ లో ఉంటూ.. అభిమానులకు తెలియజేస్తున్నారు. ఇక కరోనా వలన ఏర్పడుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇద్దరు హీరోయిన్స్ మంచి చిట్కాలు చెబుతున్నారు. అందులో రాశి ఖన్నా, తమన్నా ఉన్నారు.

ఇక రాశి ఖన్నా కరోనా పై అందరిలో అవగాహన రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఏం జరుగుతుందనేది తెలుసుకోవడం ముఖ్యం కానీ.. అది శృతి మించితేనే ప్రమాదం అందుకే యోగ, ధ్యానం లాంటివి చేస్తూ మనసును, మైండ్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. అంతే కాకుండా పుస్తకాలను చదవడం ద్వారా ఆలోచనలకూ అడ్డుకట్ట వేయవచ్చు. యోగ, ధ్యానం వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాదు.. అందం ఆరోగ్యం కూడా అంటూ రాశి ఖన్నా కరోనాకి ఎలాంటి చిట్కాలు పాటించాలో చెబుతుంది.

ఇక తమన్నా అయితే కరోనాని జయించాలంటే.. మీ పెదవులపై చిరునవ్వు చెరగకూడదు. ఎప్పుడూ నవ్వుతూ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుదాం. ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ కరోనాని జయిద్దాం. సామాజిక దూరం పాటిస్తూనే ఇవన్నీ చేయవచ్చు. ప్రస్తుతం నేను అదే చేస్తున్నాను.. అంటూ కరోనాకి రకరకాల చిట్కాలు చెబుతున్నారు మన హీరోయిన్స్. 

Corona lessons from Raashi Khanna and Tamanna:

Heroine lessons for corona relief 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ