అవును మీరు వింటున్నది నిజమే.. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న దర్శకత్వంలో ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నడుస్తోంది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగత తెలిసిందే. అయితే ఈ ‘రౌద్రం రణం రుధిరం’ తర్వాత మరో మల్టీస్టారర్ మూవీలో చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండ్రోజులుగా టాలీవుడ్‌లో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఇటు మెగాభిమానులు.. అటు నందమూరి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
అయితే.. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు..? ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారు..? అనే విషయాలు తెలియరాలేదు కానీ.. ఓ స్టార్ డైరెక్టర్ అని మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్టార్ ఎవరనేది మాత్రం రివీల్ చేయట్లేదు. వాస్తవానికి చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన తర్వాత వీరిద్దరి ఫ్రెండ్ షిప్ మరింత బలపడింది. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారనే టాక్ టాలీవుడ్‌లో నడుస్తోంది. అయితే చాలా రోజులుగా టాలీవుడ్‌లో తన రేంజ్ ఏంటో చూపించుకోవాలని ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తహతహలాడుతున్నాడు. అప్పట్లో ఎన్టీఆర్, చెర్రీ, మహేశ్ బాబు, ప్రభాస్ ఈ నలుగురూ ఆయన మనసులో ఉన్నారని వార్తలు వినిపించాయి. ఆయనే మల్టీస్టారర్ తెరకెక్కించబోతున్నాడా..? అనే సందేహాలు కలుగుతున్నాయి.
అంతేకాదు.. వీరి ఇమేజ్‌కు తగ్గట్లు ఓ ప్రముఖ రచయిత కథ రెడీ చేశారని.. ఆ స్క్రిప్ట్ చెర్రీ, జూనియర్‌కు నచ్చిందట. సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే.. అప్పట్లో స్టార్ హీరోలుగా వెలుగుతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి ఎలా అయితే వరుసగా ‘బాహుబలి’ 01, 02 సినిమాల్లో నటించారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చెర్రీ, ఎన్టీఆర్ కూడా మరో మల్టీస్టారర్ చేయబోతున్నారన్న మాట. ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.