Advertisementt

రెండు కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్!?

Wed 15th Apr 2020 03:22 PM
chiru,chiranjeevi,megastar chiranjeevi green singnal,two stories  రెండు కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్!?
Chiru Green Singnal Another Two Stories! రెండు కథలకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్!?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలు ఎంచుకునే విషయంలో యమా యాక్టివ్‌గా ఉన్నాడు. రీ ఎంట్రీ తర్వాత ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్టవ్వడంతో స్టార్ డైరెక్టర్లు ఆయనకు కథలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ప్రస్తుతం ‘ఆచార్య’ మూవీతో చిరు బిజిబిజీగా ఉన్నాడు. కరోనా లాక్‌డౌన్‌తో ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ పడింది కానీ లేకుంటే ఈ పాటికే సగానికి పైగా షూటింగ్ అయిపోయేది. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌కు బ్రేక్‌లు పడటంతో ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండిపోయారు. అయితే లాక్‌డౌన్ కొందరు దర్శకులు కథలు రాసే పనిలో ఉంటే.. మరికొందరు హీరోలు వర్కవుట్స్ ఇంకా కథలు వినే పనిలో నిమగ్నమయ్యారు.

మెగాస్టార్ ఏం చేస్తున్నాడు..? ఆయనకు ఎవరైనా కథలు చెప్పారా..? అనే విషయంపై ఆరా తీయగా ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. అదేమిటంటే.. ఈ గ్యాప్‌లో రెండు కథలు చిరు విన్నాడని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఆ ఇద్దరూ మరెవరో కాదండోయ్.. తమ్ముడు పవన్ కల్యాణ్‌కు ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో అదిరిపోయే హిట్టిచ్చిన దర్శకుడు బాబి అలియాస్ కేఎస్ రవీంద్ర ఒక కథ చెప్పగా.. అది చిరుకు తెగ నచ్చేసిందట. స్టోరీ లైన్ బాగుండటంతో కచ్చితంగా చేద్దాం.. బట్ ఇప్పుడైతే కాదు అని చిరు చెప్పాడట. అంతలోపు పూర్తి స్క్రిప్ట్‌ను తయారు చేసుకోవాలని చిరు చెప్పినట్లు సమాచారం. 

ఇక మరో కథ విషయానికొస్తే.. మొదట ‘లూసిఫర్‌’ రీమేక్ మూవీకి బాబిని అనుకున్నారట. అయితే సార్.. ఫస్ట్ తన దగ్గరేండే కథను పర్మిషన్ అడిగి మరీ స్టోరీ లైన్ విన్నాడట. బాబీ కథ కూడా చిరుకు నచ్చేసిందట. అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే రీమేక్‌తో పాటు ఈ ఒరిజనల్ కథలో చిరు హీరోగా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయ్. ఇదే జరిగితే చిరుతో బాబీకి రెండు సినిమాలు అన్నమాట. అయితే ఇటీవలే ‘లూసిఫర్’ రిమేక్‌ను సాహో డైరెక్టర్ సుజిత్ తెరకక్కిస్తారని కూడా వార్తలు కూడా వస్తున్నాయి. ఈయన పక్కా అయితే బాబీకి రెండు సినిమాలు లేదంటే ముచ్చటగా మూడు సినిమాలు అన్న మాట. మరి ఇందులో నిజానిజాలు ఎంతో తెలియాల్సి ఉంది. 

Chiru Green Singnal Another Two Stories!:

Chiru Green Singnal Another Two Stories!  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ