టైటిల్ చూడగానే ఇదేంటి..? ఎన్టీఆర్‌కు చిరంజీవికి సంబంధమేంటి..? అనుకుంటున్నారా..? ఎస్ మీరు అనుకున్నది నిజమే కానీ.. రియల్ లైఫ్ ఎలాంటి సంబంధం లేదు కానీ రీల్ లైఫ్‌తో మాత్రం ప్రస్తుతం మెగాస్టార్ చిరు చేస్తున్న పాత్రకు చాలా సత్సంబంధాలు కనిపిస్తాయ్. మీరు అనుకుంటున్నట్లుగా ఎన్టీఆర్ అంటే.. సీనియర్ ఎన్టీఆర్ కాదండోయ్ బాబూ.. జూనియర్ ఎన్టీఆర్. అసలు ఎన్టీఆర్ ఏంటి..? చిరంజీవి ఏంటి.. ఇద్దరి మధ్య పోలికలేంటి..? అనే ఇంట్రస్టింగ్ విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
లేకుంటే సగానికి పైగానే..!
సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో ‘నాకు తానే సాటి... నాకెవ్వరూ లేరు పోటీ’ అని అనిపించుకుంటూ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కథలు రాస్తుంటాడు. ఈయన ఇప్పటి వరకూ తెరకెక్కించిన సినిమాలే ఇందుకు నిదర్శనం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ మూవీని ఈయన తెరకకెక్కిస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ సినిమా షూటింగ్‌కు కూడా లాక్ పడింది.. లేకుంటే సినిమాలో సగానికి పైగానే అయిపోయేదే. కానీ ఆ ఒక్కటి మాత్రం జరగలేదు కానీ మిగిలినవన్నీ చకచకా జరిగిపోతున్నాయ్. ఇప్పటికే చిరు పాత్రేంటో..? ఎలా ఉంటుందో కాస్త క్లారిటీగానే చిరంజీవే పలు ఇంటర్వ్యూల్లో చెప్పేశాడు.
ఎన్టీఆర్ సినిమా ఇదీ..
‘జనతా గ్యారేజ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మరీ ముఖ్యంగా పర్యావరణ ప్రేమికులు ఈ సినిమా అంటే పడి చచ్చిపోతుంటారు. ఈ చిత్రం కూడా ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఎక్కడో స్టూడెంట్‌గా ఉండే ఎన్టీఆర్.. ‘జనతా గ్యారేజ్’కు వెళ్లడం సమస్యలు పరిష్కరించడం.. ఆ తర్వాత పెదనాన్న కోసం ప్రేమించిన పిల్లనే వదిలేయడం అలా కథ సాగిపోతుంది. సినిమా మొత్తమ్మీద పర్యావరణం ప్రేమే చూపించాడు కొరటాల. ఈ సినిమాను జనాలు కూడా బాగా మెచ్చుకున్నారు.. బాక్సాఫీస్ దాకా తీసుకెళ్లి హిట్ చేశారు కూడా.
చిరు సినిమా ఇదీ..
అయితే.. ప్రస్తుతం మెగాస్టార్‌ను కూడా పర్యావరణ ప్రేమికుడిగానే కొరటాల చూపించబోతున్నాడు.‘ఆచార్య’ ఓ పొలిటికల్ థ్రిల్లర్ అని ఇందులో తాను ప్రకృతి వనరులను కాపాడే వ్యక్తి అని.. ఇంట్రెస్టింగ్ పాయింట్‌ను స్వయంగా చెప్పేశాడు చిరు. ఇటీవల ఓ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు మెగాస్టార్. అంటే.. ఈ చిత్రంలో దేవాలయ భూముల ఆక్రమణ, నక్సలైట్ పాత్రలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై పోరు చేయనున్నాడన్న మాట. అంటే పర్యావరణాన్ని అలా శుభ్రం పెడతాడేమో చిరు.
వర్కవుట్ అవుతుందా!?
వాస్తవానికి ప్రకృతి ప్రేమికుడు అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు అదే జూనియర్ స్థానం చిరు వస్తున్నాడు. అంటే జూనియర్‌లాగే చిరును ఇంకాస్త కొత్తగా... ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. పర్యావరణం అంటూ ఎన్టీఆర్ మాత్రం హిట్ కొట్టేశాడు.. ఇప్పుడు చిరు పరిస్థితేంటో..? ప్రతీసారి పర్యావరణమే అంటే ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో..? అని ఫ్యాన్స్ టెన్షన్‌గా కూడా ఉన్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలోకి ఎప్పుడొస్తాడో.. అభిమానులు ఆ మూవీని చూసి రియాక్టయ్యి రిజల్ట్ ఇచ్చే వరకూ వేచి చూడక తప్పదు మరి.