Advertisementt

ప్రభాస్‌తో చేయడానికి 25 కోట్లు అడిగిందట!

Thu 16th Apr 2020 01:40 PM
deepika padukone,huge demands,prabhas,bomb,remuneration  ప్రభాస్‌తో చేయడానికి 25 కోట్లు అడిగిందట!
Deepika Padukone Huge Demands For Prabhas ప్రభాస్‌తో చేయడానికి 25 కోట్లు అడిగిందట!
Advertisement
Ads by CJ

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి తో ఇంటర్నేషనల్ గా ఎదిగిన ప్రభాస్‌తో సినిమా అంటే ఎవరైనా భారీగానే డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం రాధాకృష్ణతో ‘ఓ డియర్’ సినిమా చేస్తున్న ప్రభాస్ తో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు పాత్రలు చేస్తున్నాడని.. సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ పాత్ర పండించే ఎమోషన్ సినిమాకే హైలెట్ అంటున్నారు. మరోపక్క ప్రభాస్ పాత్ర చివరిలో చనిపోతుంది.. ఇలా ‘ఓ డియర్’ విషయంలో రోజుకో న్యూస్ ప్రచారంలోకొస్తుంది.

అయితే ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఓకే అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనేని ప్రభాస్ కి జోడిగా సంప్రదిస్తున్నారట. అయితే పద్మావత్ సినిమా తర్వాత దీపికా పదుకొనె రేంజ్ బాగా పెరిగిపోయి.. తర్వాత ఒప్పుకుంటున్న సినిమాల పారితోషకాల విషయంలో దీపికా పదుకొనె కాస్త పట్టుదలగా ఉంటుందట. అందుకే ప్రభాస్ తో సినిమా చెయ్యాలి అంటే 25 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దాంతో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. కానీ నాగ్ అశ్విన్ కి మాత్రం ఖచ్చితంగా ప్రభాస్ కోసం దీపికా అయితేనే బావుంటుంది అని అంటున్నాడట. మరి నిర్మాత కూడా మామగారు అశ్వినీదత్తేగా.. ఏమన్నా అడ్జెస్ట్మెంట్ చేస్తాడేమో చూద్దాం. 

Deepika Padukone Huge Demands For Prabhas:

Demanding A Bomb To Explode On Prabhas

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ