Advertisementt

ఆ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి అవకాశం వస్తుందో..?

Sat 18th Apr 2020 04:21 PM
ayyappanum koshiyum,rana,gautam thinnanuri,sudheer varma,sitara entertainments,bheeshma  ఆ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి అవకాశం వస్తుందో..?
who will get a chance to direct remake..? ఆ ఇద్దరు దర్శకుల్లో ఎవరికి అవకాశం వస్తుందో..?
Advertisement
Ads by CJ

తెలుగులో రీమేక్ చిత్రాల జొరు రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. తెలుగు చిత్రాలని ఇతర భాషల్లో రీమేక్ చేయడంతో పాటు ఇతర భాషల చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అవుతున్నాయి. అయితే తాజాగా భీష్మ సినిమాతో విజయం అందుకున్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ మళయాల చిత్రమైన అయ్యప్పనం కోషియంని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తుంది. మళయాల హీరోలు పృథ్వీరాజ్, బిజు మీనన్ నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ ని తెరకెక్కించే దర్శకుల కోసం వెతుకుతున్నారట సితార టీమ్. తెలుగు రీమేక్ లో హీరోగా రానాని తీసుకున్నారని సమాచారం. మరో పాత్రలో ప్రముఖ హీరోని తీసుకోనున్నారట. దాంతో ఈ సినిమా మల్టీస్టారర్ అవనుంది. అయితే ఈ మల్టీస్టారర్ ని తెరకెక్కించే అవకాశం ఇద్దరు దర్శకుల్లో ఒకరికి ఇవ్వాలని అనుకుంటున్నారట.  జెర్సీ మూవీతో మెమరబుల్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి, స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మల పేర్లని పరిశీలిస్తున్నారట.

ఇప్పటి వరకు ఈ ఇద్దరు దర్శకులకి స్టార్లతో సినిమా చేసిన అనుభవం లేదు. అయినా కూడా ఈ ఇద్దరిలో ఒక్కరికీ అవకాశ ఇవ్వనున్నారట. గౌతమ్ తిన్ననూరి జెర్సీ హిందీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. ఇటు సుధీర్ వర్మ కొరియన్ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందో..!

who will get a chance to direct remake..?:

Ayyappanum koshiyum will be directed by 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ