రామ్ చరణ్ పుట్టినరోజుకి మెగా ఫ్యాన్స్‌కి రాజమౌళి మాత్రమే కాదు.. ఇండియా వైడ్ ప్రేక్షకులకు గొప్ప బహుమతి గా RRR రామ్ చరణ్ స్పెషల్ వీడియో ని విడుదల చేసాడు. కరోనా లాక్ డౌన్ టైం లో రామ్ చరణ్ వీడియో విడుదల చేస్తే ఎలా ఉంటుందో అని అనేక తర్జన భర్జనలు మధ్యన రామ్ చరణ్ వీడియో విడుదల చెయ్యగా ఆ వీడియో కి అదిరిపోయే స్పందన వచ్చింది. అయితే రేపు రాబోయే ఎన్టీఆర్ బర్త్ డే కి ఎలాంటి వీడియో ఇవ్వబోతున్నారో అనే విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్యూరియాసిటీ తో ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఒక స్పెషల్ కాదు.. డబుల్ బొనాంజా అంటూ ప్రచారం జరుగుతుంది. రాజమౌళి లాక్ డౌన్ తో కాస్త ఫ్రీ అవడంతో ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు విడుదల చెయ్యబోయే స్పెషల్ వీడియో ని కట్ చేస్తూ దానికి ఎన్టీఆర్ తో డబ్బింగ్ చెప్పిస్తున్నాడని... ఎన్టీఆర్ వీడియో తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి మాత్రమే కాదు... ఇండియా వైడ్ సినీ ప్రియులకు గూస్ బంప్స్ రావడం ఖాయం అంటున్నారు. అయితే మరో ట్రీట్ ఏమిటంటే.. ఎన్టీఆర్ RRR తరవాత త్రివిక్రమ్ తో మూవీ ఎనౌన్స్ చేసాడు,. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ కి సంబందించిన స్క్రిప్ట్ పనులతో లాక్ డౌన్ కాలాన్ని కరిగిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ బర్త్ డే కి త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమా టైటిల్ కానీ.. ఫస్ట్ లుక్ కానీ సిద్ధం చేస్తున్నాడని, ప్రస్తుతం స్క్రిప్ట్ తో పాటుగా ఈ పనులు కూడా త్రివిక్రమ్ మొదలెట్టాడని అంటున్నారు. మరి ఎన్టీఆర్ ఫాన్స్ కి ఒకటి కాదు... రెండు స్పెషల్ ట్రీట్స్ ఎన్టీఆర్ పుట్టిన రోజుకి అందబోతున్నాయన్నమాట.