టాలీవుడ్ లో జానీ మాస్టర్ అంటే తెలియని వారుండరు. కాస్త టెంపెర్మెంట్, కాస్త కోపం లాంటి విషయాలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బాగా ఫేమస్ అయ్యాడు. అయితే కరోనా లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న జానీ మాస్టర్ షూటింగ్స్ బాగా మిస్ అవుతున్నాడట. ఇక సమంత తో ఈగ సినిమా చేసిన జానీ మాస్టర్.. సమంత తన ఫ్యామిలీ సభ్యురాలు అని చెబుతున్నాడు. ఇక తనకి డాన్స్ విషయంలో ప్రభుదేవా మాస్టర్ అంటే స్ఫూర్తి అని చెప్పిన జానీ మాస్టర్ కి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో అవకాశమొస్తే చేస్తారా అని అడిగితే... వకీల్ సాబ్ లో డాన్స్ పెరఫార్మెన్సెస్ కి చోటు ఉండదేమో అని.. చెప్పిన జానీ మాస్టర్.. క్రిష్ సినిమాలో అయినా, హరీష్ శంకర్ సినిమాలోలో అయినా పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా అని చెప్పాడు.
ఇక పవన్ కళ్యాణ్ తో లైట్ గా మాస్ స్టెప్స్ వేయిస్తే ఎలా ఉంటుంది అని జానీ ని అడిగితే,.... నాకు కూడా పవన్ కళ్యాణ్ తో మాస్ స్టెప్స్ వేయించాలని ఉందని అన్నాడు. ఇక ఎన్టీఆర్ తో డాన్స్ అంటే ఇష్టమని, అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఎవరికీ వారే డాన్స్ లో అదుర్స్ అని చెబుతున్న జానీ మాస్టర్... రామ్ చరణ్ ని మొదటిసారి కలిసినప్పుడు యువరాజు అంటే ఇలానే ఉంటాడు... చిరు లోని గ్రేస్, అందం, పెరఫార్మెన్స్ అన్ని రామ్ చరణ్ లో అలా దిగిపోయాయి అంటున్నాడు. ఇక తనకిష్టమైన సినిమా అంటే జానీ సినిమా అని చెప్పిన జానీ మాస్టర్.. బన్నీతో బుట్టబొమ్మ సాంగ్ చేసిన ఫీలింగ్ ఏమిటి అని అడిగితే... ఆ సాంగ్ చేసినప్పుడు చాలా టెన్షన్ లో ఉన్నామని.. కానీ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆ టెన్షన్ మర్చిపోయామని చెబుతున్నాడు. ఇక బన్నీతో ‘పుష్ప’లో అదిరిపోయే మాస్ స్టెప్స్ వాయించు బ్రో అని ఓ అభిమాని అడిగితే.. దానికి జానీ మాస్టర్ అది మా దర్శకుడి ఛాయస్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పి తప్పించుకున్నాడు.