కరోనా మహమ్మారి మన జీవితాలని బాగా డిస్టర్బ్ చేసింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మానవ పరిణామక్రమంలో ఇలాంటి పరిణామాలు చాలా సార్లు జరిగి ఉండవచ్చు. కానీ ౨౧వ శతాబ్దంలో మనిషి ఎన్నో విజయాలు సాధించిన తర్వాత.. ఏదైనా సాధించవచ్చు అన్న నమ్మకం కుదిరిన తర్వాత... ఇక మన ప్రయాణం మరో గ్రహం మీదకే అని అనుకుంటున్న తరుణంలో కరోనా రక్కసి ఇంటి గడప కూడా దాటకుండా చేసింది.
కరోనా వల్ల ఎన్నో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సినీ పరిశ్రమ భవిష్యత్తు ఏంటనేది ఎవ్వరికీ తెలియట్లేదు. ఒకవైపు ఇప్పటి వరకు షూటింగ్ పూర్తయిన సినిమాలని ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియదు. మరో వైపు షూటింగ్ పూర్తి కావాల్సిన చిత్రాలు.. ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో తెలియదు. కరోనా లేకపోతే ఇప్పటివరకు థియేటర్ల వద్ద మామూలు సందడి ఉండేది కాదు.
కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి వాటి అదృష్టాన్ని పరీక్షించుకునేవి. అయితే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న ఉప్పెన చిత్రం కరోనా వల్ల డిసెంబర్ నెలకి వాయిదా పడిందని అంటున్నారు. లాక్డౌన్ ఎత్తేసినా కూడా థియేటర్లు తెరుచుకోవడానికి మరో రెండు నెలలు సమయం పడుతుంది.
థియేటర్లు తెరుచుకున్నాక సినిమాలన్ని పోటీకి దిగుతుంటాయి. కాబట్టి వైష్ణవ్ తేజ్ సినిమాని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే అందుకు మరో కారణం కూడా ఉందట. ఈ సినిమాకి ఇప్పటికే బాగా ఖర్చు పెట్టారట. అవన్నీ రావాలంటే జనాలు థియేటర్లకి అలవాటు పడ్డాక కానీ సాధ్యపడని ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.