Advertisementt

ఎన్టీఆర్ ఛాలెంజ్‌కి చిరు ఓకే.. బాల బాబాయ్?

Tue 21st Apr 2020 05:00 PM
chiranjeevi,jr ntr,be the real man,challenge,balakrishna,young tiger  ఎన్టీఆర్ ఛాలెంజ్‌కి చిరు ఓకే.. బాల బాబాయ్?
Jr NTR Challenge to Nandamuri Natasimham Balakrishna ఎన్టీఆర్ ఛాలెంజ్‌కి చిరు ఓకే.. బాల బాబాయ్?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ సెలబ్రిటీస్ మధ్య బీ ద రియల్ మ్యాన్ ఛాలెంజ్ నడుస్తుంది. టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా ఇంటిని శుభ్రం చేస్తూ విసిరిన ఛాలెంజ్ ని రాజమౌళి ఇంటిని శుభ్రం చేస్తూ స్వీకరించడమే కాదు... రాజమౌళి తన ఛాలెంజ్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు విసిరాడు. అయితే రాజమౌళి ఛాలెంజ్ ని స్వీకరించిన ఎన్టీఆర్.. ఇంటిని తడి బట్టతో శుభ్రం చెయ్యడమే కాదు... గిన్నెలు క్లాత్ తో తుడిచి, ఆపై గార్డెన్ ని శుభ్రం చేసాడు.

అంతేనా ఇంట్లోని ప్రేమ ఆప్యాయతలు కాదు.. అందరూ కలిసి పనులు పంచుకుందాం అంటూ ట్వీట్ చేసాడు. ఇక తన ఛాలెంజ్ ని బాలా బాబాయి, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేశ్ గారు, కొరటాల శివగారుకి ఈ సవాలు విసురుతున్నాను అంటూ ట్వీట్ వేసాడు. మరి ఎన్టీఆర్ తో కాస్త దూరం మెయింటైన్ చేస్తున్న బాల బాబాయ్ ఎన్టీఆర్ ఛాలెంజ్ స్వీకరిస్తాడా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలో మొదలయ్యాయి. మరోవైపు ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను మెగాస్టార్ చిరంజీవి స్వీకరిస్తున్నట్లుగా ట్వీట్ చేయడంతో ఈ ఛాలెంజ్ మరింత ఆసక్తికరంగా మారింది.

Jr NTR Challenge to Nandamuri Natasimham Balakrishna:

Chiranjeevi accepted Jr ntr Challenge

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ