మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ వేషాల కోసం గ్లామర్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాని అల్లాడిస్తుంది. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చూసి భయపడి అవకాశాలు ఇవ్వడం తగ్గించిన దర్శకనిర్మాతలకు తాను గ్లామర్ షో కి రెడీ అంటూ సంకేతాలు పంపుతుంది. ఓ ఆరు నెలల నుండి నిహారిక హాటెస్ట్ ఫోటోస్‌తో సోషల్ మీడియాని షేక్ చెయ్యడమేకాదు, యంగ్ హీరోలతో పాటుగా, దర్శకనిర్మాతల కళ్ళు ఆమెపై పడేలా చేస్తుంది. అయితే తాజాగా నిహారిక యాంకర్ రవితో సోషల్ మీడియా చాటింగ్ లోకి రాగా... రవి అడిగిన ప్రశ్నలకు నిహారిక తెలివిగా సమాధానాలు చెప్పింది. రవి... మీరు పెళ్లి తర్వాత కూడా నటిస్తారా అని అడగగా... నేనేమన్నా సమంతని అనుకుంటున్నారా.. పెళ్లి తర్వాత నటిస్తాను అని చెప్పడానికి... పెళ్లి తర్వాత నటించొచ్చు, నటించకపోవచ్చు.
పెళ్లి తర్వాత నటిస్తానని, నటించేలేనని ముందే చెప్పలేను కాబట్టి.. నాకు సమయం చాలా తక్కువ ఉంది. అందుకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిసైడ్ అయ్యా అని చెప్పిన నిహారిక ని రవి.. మరి గ్లామర్ పాత్రలు పోషిస్తారా అని అడగగా.. నేను ప్రస్తుతం గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతున్నా.... ప్రస్తుతం ఓ తమిళ సినిమా లో రొమాంటిక్ గా నటిస్తున్నా. గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న ఆసినిమా లో గోవా బీచ్ లో రొమాంటిక్ సన్నివేశాల షూట్ జరుగుతుంది. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. సో నేను గ్లామర్ షో కి రెడీ అంటూ నిహారిక బహిరంగంగానే దర్శకనిర్మాతలకు ఛాలెంజ్ విసురుతుంది.